బీసీలకు లక్ష రూపాయల పథకానికి సంబంధించి దరఖాస్తు గడువును జూన్ 20 గా రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. అయితే సర్టిఫికెట్లు మరియు ఇతర ద్రౌపత్రాలు పొందేందుకు ఆలస్యం అవుతుండడంతో ఈ పథకానికి సంబంధించి దరఖాస్తు గడువును పొడిగించాలని లబ్ధిదారులు ప్రభుత్వాన్ని విజ్ఞప్తి చేయడం జరిగింది. దీనిపై మంత్రి గంగుల క్లారిటీ ఇచ్చారు. అదేవిధంగా అమౌంట్ ఎప్పుడు జమ చేస్తారో కూడా ప్రకటించడం జరిగింది.
గడువు పెంపు ఉండదు : మంత్రి గంగుల
అయితే ప్రజల నుంచి విజ్ఞప్తులు వచ్చినప్పటికీ రాష్ట్ర ప్రభుత్వం వీటిని పరిగణలోకి తీసుకోవడం లేదు. ఈ పథకానికి జూన్ 20 చివరి తేదీగా ఉంటుందని ఈ పథకానికి సంబంధించి గడువును పొడిగించడం లేదని మంత్రి గంగుల ప్రకటించారు.
ఇప్పటికే ఈ పథకానికి సంబంధించి 5.28 లక్షల దరఖాస్తులు వచ్చినట్లు ప్రభుత్వం తెలిపింది. ఎక్కువగా రజక, నాయి బ్రాహ్మణ, కుమ్మరి, వడ్డెర, విశ్వ బ్రాహ్మణ కులాల నుంచి అప్లికేషన్స్ వచ్చినట్లు ప్రభుత్వం తెలిపింది.
ఇక ఈ పథకానికి సంబంధించి ఆన్లైన్లో దరఖాస్తు చేసుకుంటే సరిపోతుంది. ఇందుకోసం దరఖాస్తు చేసుకున్న తర్వాత సదరు లబ్ధిదారుడు వేరే ఎవరిని సంప్రదించాల్సిన అవసరం లేదని ఇటీవల ప్రభుత్వం క్లారిటీ ఇచ్చిన విషయం తెలిసిందే.
ఇక ఈ పథకానికి సంబంధించి ఏ విధంగా దరఖాస్తు చేసుకోవాలో పూర్తి విధానం కింది లింక్ క్లిక్ చేసి తెలుసుకోండి.
జూలై 15న అమౌంట్ విడుదల
జూన్ 20 వరకు దరఖాస్తు చేసుకున్న లబ్ధిదారుల జాబితాలను పరిశీలించి జులై 5 న కలెక్టర్లు అర్హుల జాబితాను ప్రభుత్వానికి అందించినట్లు మంత్రి గంగుల తెలిపారు. ఈ విధంగా అర్హత పొందిన వారికి జూలై 15న చెక్కులు పంపిణీ చేస్తామని ప్రకటించారు.
ఇది చదవండి: తొలి దశలో బీసీలకు లక్ష పథకానికి అర్హత ఉన్న కులాల జాబితా ఇదే
Leave a Reply