Rythu Bhandhu : రైతులకు గుడ్ న్యూస్, ఆరోజు నుంచే రైతుబంధు డబ్బులు

Rythu Bhandhu : రైతులకు గుడ్ న్యూస్, ఆరోజు నుంచే రైతుబంధు డబ్బులు

రైతులకు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం గుడ్ న్యూస్ తెలిపింది. ప్రతి ఏటా ఖరీఫ్ మరియు యాసంగి పంటలకు సంబంధించి రెండు విడతల్లో ఎకరాకు 5000 చొప్పున రైతుబంధు నిధులను రాష్ట్ర ప్రభుత్వం జమ చేస్తున్న విషయం తెలిసిందే.

ఇందులో భాగంగా ప్రస్తుతం ఖరీఫ్ సీజన్ కి సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం తేదీలను ఖరారు చేసింది.

జూన్ 26 నుంచి రైతు బంధు

రైతుబంధు ఖరీఫ్ సీజన్ నిధులను రాష్ట్ర ప్రభుత్వం జూన్ 26 నుంచి జమ చేయనున్నట్లు ప్రకటించింది. ప్రతి ఎకరాకు 5000 చొప్పున రైతుల ఖాతాలో నేరుగా అమౌంట్ ని రాష్ట్ర ప్రభుత్వం జమ చేయనుంది.

మొత్తం పది రోజులపాటు ఈ కార్యక్రమం కొనసాగనుంది. ముందుగా ఎకరం పొలం ఉన్నవారికి నిధులు జమ చేస్తారు ఆ తర్వాత రెండు ఎకరాలు ఆ తర్వాత అంతకంటే ఎక్కువ ఉన్నవారికి ప్రాధాన్యత క్రమంలో రాష్ట్ర ప్రభుత్వం అమౌంట్ ని విడుదల చేస్తుంది.

Rythu Bandhu 2023 Release Date : 26.06.2023

ఇక పొడు భూములకు పట్టాలు పంపిణీ చేయాలని నిర్ణయించింది. ఆ తర్వాత పోడు భూముల రైతులకు కూడా రైతుబంధు పంపిణీ చేసేలా చర్యలు తీసుకోవాలని ముఖ్యమంత్రి కేసీఆర్ ఆదేశించారు.

రైతుబంధు కొత్త రిజిస్ట్రేషన్స్ మరియు సవరణలకు అవకాశం

మరోవైపు రైతు బంధు పథకానికి సంబంధించి గత ఏడాది డిసెంబర్ 22 లోపు పట్టాదార్ పాస్ పుస్తకం పొందిన వారికి కొత్త రిజిస్ట్రేషన్స్ కి పోర్టల్ లో అవకాశం కల్పించడం జరిగింది.

ఈ మేరకు ఏఈవో ల లాగిన్ లో అవకాశం ఇచ్చారు. అదేవిధంగా రైతుబంధు లబ్ధిదారులు తమ బ్యాంకు పాస్ పుస్తకం లేదా మొబైల్ నెంబర్ ను అప్డేట్ చేసుకునే ఆప్షన్ కూడా ప్రస్తుతం కల్పించడం జరిగింది.

Click here to Share

You cannot copy content of this page