రాష్ట్ర ప్రభుత్వం ఇటీవల ప్రవేశపెట్టిన బీసీలకు లక్ష రూపాయల పథకం సంబంధించి ప్రస్తుతం అప్లికేషన్స్ కొనసాగుతున్నాయి. ఈ పథకానికి సంబంధించి ఇప్పటికే భారీగా స్పందన లభిస్తున్న నేపథ్యంలో ప్రభుత్వం కీలక అప్డేట్ జారీ చేసింది
ఆన్లైన్ లో దరఖాస్తు చేస్తే చాలు
జూన్ 20 వరకు దరఖాస్తు చేసుకునేందుకు గడువు ఉండగా ఇప్పటికే 2 లక్షలకు పైగా దరఖాస్తులు వచ్చాయని ప్రభుత్వం వెల్లడించింది. ఎక్కువగా రజక, నాయి బ్రాహ్మణ, కుమ్మరి, వడ్డెర, విశ్వ బ్రాహ్మణ కులాల నుంచి అప్లికేషన్స్ వచ్చినట్లు ప్రభుత్వం తెలిపింది.
ఇక ఆన్లైన్ లో అప్లై చేసుకున్న వారు వేరే ఎవరిని సంప్రదించాల్సిన అవసరం లేదు అని ప్రభుత్వం తెలిపింది.
ఇక పై ప్రతి నెల ఈ పథకం అమలు
బీసీలకు లక్ష పథకం నిరంతరాయంగా కొనసాగుతుందని మంత్రి గంగుల తెలిపారు. ప్రతి నెల 5 వ తేదీ కలెక్టర్లు లబ్ధిదారుల జాబితాను ప్రభుత్వానికి పంపించాలని , అదే నెల 15 న స్థానిక ఎమ్మెల్యే ద్వారా లక్ష ఆర్థిక సహాయాన్ని అందిస్తామని ఆయన అన్నారు.
బీసీలకు లక్ష.. ఇలా అప్లై చేయండి
ఈ పథకానికి దరఖాస్తు చేసుకునే వారు కింది విధంగా సులభంగా దరఖాస్తు చేసుకోవచ్చు.
బీసీలకు లక్ష పథకం కులాల లిస్ట్ కోసం కింది లింక్ క్లిక్ చేయండి.
Leave a Reply