దేశవ్యాప్తంగా గత కొన్ని నెలలుగా వంట నూనె ధరలు దిగివస్తున్నాయి. వంట నూనె ధరలను కట్టడి చేయడంలో భాగంగా కేంద్ర ప్రభుత్వం చేపడుతున్న చర్యలు ఇందుకు దోహదపడుతున్నాయి. ఇటీవల ఆయిల్ కంపెనీలకు ధరలను తగ్గించాలని సూచించినటువంటి ప్రభుత్వం తాజాగా మరో కీలక నిర్ణయం తీసుకుంది.
వంట నూనెపై దిగుమతి సుంకాన్ని తగ్గిస్తూ కీలక నిర్ణయం
ద్రవ్యోల్బణం మరియు నూనె ధరలను కట్టడి చేసే చర్యల్లో భాగంగా కేంద్ర ప్రభుత్వం దిగుమతి సుంకాన్ని 17.5% నుంచి 12.5% తగ్గించడం జరిగింది.
రిఫైన్ సోయాబీన్ ఆయిల్ రిఫండ్ సన్ఫ్లవర్ ఆయిల్ దిగుమతులపై ఈ తగ్గింపు వర్తిస్తుంది.
తాజా నిర్ణయంతో మరింత తగ్గనున్న ధరలు
ప్రస్తుతం మార్కెట్లో వంట నూనె ధరలు 110 నుంచి 130 రూపాయలు మధ్య ఉండగా, కేంద్ర ప్రభుత్వం తాజాగా తీసుకున్నటువంటి నిర్ణయంతో ధరలు మరింత తగ్గే అవకాశం ఉంది. గత నెలలో ఆయిల్ కంపెనీలను నూనె ధరలు తగ్గించమని కోరడంతో పది రూపాయలు మేరా తగ్గినటువంటి నూనె ధరలు, ప్రస్తుతం మరో 10 నుంచి 15 రూపాయలు వరకు తగ్గే అవకాశం కనిపిస్తుంది.
ఇదే నిజమైతే వంద రూపాయలు దిగువకు వంట నూనె ధరలు చేరే అవకాశం లేకపోలేదు. గత ఏడాది ఒకానొక దశలో 200 రూపాయలను దాటిన ధరలు ప్రస్తుతం నిలకడగా కొనసాగుతున్నాయి.
అయితే ప్రతి ఏటా మన దేశం దిగుమతి చేసుకునే క్వాంటిటీ పెరుగుతూనే వస్తుంది. 2023 ఏప్రిల్ లో భారత్ 1.05 మిలియన్ టన్నుల వంటనూనెలను దిగుమతి చేసుకుంది. అంతకుముందు ఏడాదితో పోల్చుకుంటే ఇది 15% అధికం.
ఏదేమైనా వంట ధర నూనె ధరలు క్రమంగా తగ్గుతుండడం సామాన్యులకు ఊరటనిచ్చే అంశం అని చెప్పవచ్చు.
Leave a Reply