బీసీలకు లక్ష రూపాయలు పథకాన్ని రాష్ట్ర ప్రభుత్వం ప్రారంభించిన విషయం తెలిసిందే. ఈ పథకం కింద అర్హులుగా ఎంపికైన వారికి ప్రభుత్వం లక్ష రూపాయలను అందించడం జరుగుతుంది.
జూన్ 9వ తేదీన తొలి విడతగా ఈ కార్యక్రమాన్ని ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రారంభించడం జరిగింది. ఈ పథకానికి దరఖాస్తు చేసుకునేందుకు జూన్ 20 వరకు అవకాశం ఇవ్వడం జరిగింది.
బీసీలకు లక్ష పథకంలో పద్మశాలీలపై క్లారిటీ
అయితే ప్రభుత్వం తొలి దశలో భాగంగా ప్రకటించినటువంటి కులాల లిస్టులో పద్మశాలి కులం లేదు.
చేతివృత్తుల్లో ప్రధానంగా ఆధారపడిన కులాలలో పద్మశాలి కులం ముఖ్యమైనది. సాధారణంగా వీరు నేత పనిచేస్తూ ఉంటారు. అయితే ఈ కులం తొలి దశ లిస్టులో లేకపోవడంతో రాష్ట్ర వ్యాప్తంగా విమర్శలు రావడం జరిగింది.
ఈ నేపథ్యంలో పద్మశాలీలను కూడా ఈ పథకంలో భాగస్వామ్యం చేయాలని ఎమ్మెల్సీ ఎల్ రమణ ప్రభుత్వానికి విజ్ఞప్తి చేయడం జరిగింది. ఈ విజ్ఞప్తిని పరిగణలోకి తీసుకున్నట్లుగా సమాచారం.
త్వరలో వీరిని కూడా లక్ష రూపాయల పథకంలో చేర్చే అవకాశం ఉన్నట్లు తెలుస్తుంది. దీనికి సంబంధించి త్వరలో అధికారిక ప్రకటన వెలువడే అవకాశం ఉన్నట్లు సమాచారం.
ప్రభుత్వం తొలి దశలో భాగంగా ప్రకటించినటువంటి కులాల లిస్ట్ కింది లింక్ ద్వారా చెక్ చేయండి
బీసీలకు లక్ష రూపాయలు పథకం అప్లికేషన్ విధానం కింది లింక్ ద్వారా చెక్ చేయండి
అదేవిధంగా ఈ పథకానికి అర్హులైన వారు ఆన్లైన్లో లేదా మీసేవ కేంద్రాల్లో సంప్రదించి సులభంగా దరఖాస్తు చేసుకోవచ్చు. దరఖాస్తు చేసుకున్న వారు వేరే ఎవరిని కూడా సంప్రదించాల్సిన అవసరం లేదని మంత్రి గంగుల ఇటీవల క్లారిటీ ఇవ్వటం జరిగింది.
Leave a Reply