ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మరో కొత్త పథకానికి శ్రీకారం చుట్టనుంది. జగనన్న సురక్ష పేరుతో ఈ కొత్త పథకాన్ని అమలు చేయనుంది.
అసలు ఏంటి ఈ జగనన్న సురక్ష?
ప్రజలకు ఏదైనా పత్రాలకు సంబంధించి, సర్టిఫికెట్లకు సంబంధించి లేదా సంక్షేమ పథకాలకు సంబంధించి ఏవైనా సమస్యలు ఉంటే వాటిని త్వరితగతిన పరిష్కరించేందుకు ప్రభుత్వం ఈ కొత్త పథకానికి శ్రీకారం చుట్టింది.
ప్రజల ఫిర్యాదుల కోసం ఇప్పటికే ఉన్నటువంటి జగనన్నకి చెబుదాం కార్యక్రమానికి అనుసంధానంగా ఈ పథకం కూడా కొనసాగనుంది.
నెలరోజుల పాటు కొనసాగనున్న ఈ జగనన్న సురక్ష పథకం ద్వారా ప్రజల సమస్యలకు సంబంధించి మండలాధికారులు క్యాంపులు నిర్వహించడం జరుగుతుంది. ప్రభుత్వ పథకాలు లేదా ఏదైనా పత్రాలు, సర్టిఫికెట్లకు సంబంధించి ఏమైనా సమస్యలు ఉంటే వారిని వెంటనే సచివాలయాల వద్దకు తీసుకువచ్చి వారికి కావాల్సిన సర్టిఫికెట్లు లేదా డాక్యుమెంట్లు లేదా పథకాలకు అర్హతలకు సంబంధించి ఏమైనా సాంకేతిక సమస్యలు ఉంటే వెంటనే పరిష్కరించేందుకు చర్యలు చేపడతారు.
జగనన్న సురక్ష పథకం ఎప్పటి నుంచి అమలు చేస్తారు? షెడ్యూల్ ఇదే
ఈ పథకాన్ని జూలై 1 నుంచి నెలరోజుల పాటు రాష్ట్రవ్యాప్తంగా అమలు చేస్తారు. జగనన్న సురక్ష లో భాగంగా వివిధ పథకాల కింద అర్హులుగా గుర్తించిన వారిని ఆగస్టు 1 న ప్రకటించడం జరుగుతుంది.
ఈ పథకానికి సంబంధించి జూన్ 24 నుంచి వాలంటీర్లు, ద్వారా ఇంటింటి ప్రచారం నిర్వహించనున్నారు.
ఇంటింటి కి వెళ్లి సమస్యల నమోదు
జూలై 1 నుంచి సచివాలయాలు, మండల స్థాయిలో క్యాంపులు నిర్వహించే ముందు జూన్ 24 నుంచి సచివాలయం సిబ్బంది, వాలంటీర్లు, గృహసారథులు ప్రతి ఇంటికి వెళ్ళి సమస్యలను అడిగి తెలుసుకుంటారు. సర్టిఫికేట్ ల జారీ కి సంబంధించి కూడా ఏవైనా సమస్యలు ఉంటే తెలుసుకొని వెంటనే నమోదు చేసుకోవడం జరుగుతుంది.
వీరికి జూలై 1 నుంచి క్యాంపుల ద్వారా ఆయా సచివాలయాల పరిధిలో వెంటనే సర్టిఫికేట్లు జారీ చేయడం జరుగుతుంది. ఏమైనా పథకాలకు సంబంధించి సమస్యలు ఉన్నా పరిష్కరించడం జరుగుతుంది.
Leave a Reply