నైరుతి రుతుపవనాలు ఏపీ లోకి ప్రవేశించాయి. తిరుపతి జిల్లా శ్రీహరికోట సమీప ప్రాంతాలపై నైరుతి రుతుపవనాలు విస్తరిస్తున్నాయని అమరావతి వాతావరణ కేంద్రం ప్రకటించింది.
ఏపీలోకి ప్రవేశించిన రుతుపవనాలు
ప్రస్తుతం నైరుతి రుతుపవనాలు ఏపి లో దక్షిణ కోస్తా, శ్రీహరికోట ప్రాంతాల్లో ఇక కర్ణాటక లోని శివమోగ్గ , హాసన్ తమిళనాడులోని ధర్మపురి, రత్నగిరి ప్రాంతాలపై ఉన్నట్లు ఐఎండి తెలిపింది.
ప్రస్తుతం ఈ మూడు రాష్ట్రాలలో నైరుతి రుతుపవనాలు మరింతగా విస్తరించేందుకు అవకాశాలు ఉన్నట్లు వాతావరణ శాఖ తెలిపింది. విస్తరించే సమయంలో రానున్న 24 గంటల్లో ఏపీలో పలుచోట్ల తేలికపాటి జల్లులు పడే అవకాశం ఉన్నట్లు తెలిపింది.
తెలంగాణలో తేలిక నుంచి మోస్తారు వర్షాలు
రానున్న మూడు రోజుల్లో తెలంగాణలో పలు ప్రాంతాల్లో ఈదురు గాలులు, ఉరుములు మెరుపులతో కూడిన తేలికపాటి వర్షాలు పడతాయని హైదరాబాద్ వాతావరణ శాఖ వెల్లడించింది. మరోవైపు నైరుతి రుతుపవనాలు ఆంధ్రప్రదేశ్, తమిళనాడు, కర్ణాటక వైపు నుంచి మరింత గా విస్తరించి పశ్చిమ దిశగా తెలంగాణ ను తాకనున్నాయు.
మరో వారం రోజుల్లో తెలుగు రాష్ట్రాల్లో చురుగ్గా నైరుతి రుతుపవనాలు కదిలి రెండు రాష్ట్రాల్లో వాతావరణం చల్లబడే అవకాశం ఉంది.
Leave a Reply