రాష్ట్రవ్యాప్తంగా ఉన్న అన్ని ఆరోగ్యశ్రీ అమలు అయ్యే ఆస్పత్రుల్లో గర్భిణులకు అల్ట్రాసౌండ్, టిఫా స్కానింగ్ సేవలు ఉచితంగా అందించనున్నట్లు రాష్ట్ర వైద్య, ఆరోగ్యశాఖ మంత్రి విడదల రజిని తెలిపారు.
గర్భిణులకు ఎంతో ముఖ్యమైన అల్ట్రాసౌండ్, టిఫా స్కానింగ్లను కూడా ఆరోగ్యశ్రీ పరిధిలోకి తీసుకుస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఈ సేవలను మంత్రి రజిని శుక్రవారం గుంటూరులోని వేదాంతం హాస్పిటల్లో లాంఛనంగా ప్రారంభించారు. అలాగే గర్భిణులకు సీమంతం చేసి పౌష్టికాహార కిట్లను పంపిణీ చేశారు.
రాష్ట్రవ్యాప్తంగా ఏటా 64వేల మందికిపైగా టిఫా స్కానింగ్ అవసరం ఉంటుందని, అందుకు దాదాపు రూ.7 కోట్ల ఖర్చవుతుందని, ఆ మొత్తాన్ని ఇకపై ప్రభు
త్వమే భరిస్తుందని చెప్పారు.
అల్ట్రా సౌండ్ స్కానింగ్ ప్రతి గర్భిణికి రెండుసార్లు చేయాల్సి ఉంటుంది. ఇప్పుడు ప్రభుత్వం పూర్తి ఉచితంగా ఆరోగ్యశ్రీ ద్వారా చేసేలా మార్పులు చెయ్యడం జరిగింది.
Leave a Reply