రాష్ట్ర వ్యాప్తంగా చేనేత కార్మికులకు ప్రతి ఏటా అందిస్తున్నటువంటి 24 వేల రూపాయల ఆర్థిక సహాయానికి సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం ఈ ఏడాది timelines ను విడుదల చేసింది. 2023 24 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి వైఎస్ఆర్ నేతన్న నేస్తం అమౌంట్ ను జూలై లేదా ఆగస్టులో విడుదల చేయనున్న నేపథ్యంలో ముందుగా చేపట్టవలసిన ప్రిపరేటరీ ఆక్టివిటీస్ తో కూడిన పూర్తి షెడ్యూల్ ను ప్రభుత్వం విడుదల చేసింది.
వైయస్సార్ నేతన్న నేస్తం షెడ్యూల్ ఇదే
వైయస్సార్ నేత నేస్తం 2023 24 కి సంబంధించి
➢ కొత్త లబ్ధిదారులు జూన్ 20 వరకు గ్రామ వార్డు సచివాలయాల ద్వారా దరఖాస్తు చేసుకోవచ్చు.
➢ఇక పాత లబ్ధిదారులు ఎవరైతే ఉంటారో వారికి జూన్ 21 నుంచి 23 వరకు సచివాలయాల స్థాయిలో వెరిఫికేషన్ నిర్వహిస్తారు.
➢ ఇక అర్హుల తాత్కాలిక జాబితాను జూన్ 28 29 తేదీలలో సోషల్ ఆడిట్ కోసం సచివాలయాలలో ప్రదర్శించడం జరుగుతుంది, ఏమైనా అబ్జెక్షన్స్ లేదా ఫిర్యాదులు ఉంటే వాటిని సవరించి తుది జాబితా ను జూలై 6,7 తేదీలలో విడుదల చేయనున్నట్లు ప్రభుత్వం తెలిపింది.
నేతన్న నేస్తం పూర్తి షెడ్యూల్ కింది టేబుల్ లో మీరు చూడవచ్చు
Si. No | Activity | Date |
1 | Enrolment of new beneficiaries by Village/Ward Secretariats. | Up to 20.06.2023 |
2 | Verification of new beneficiaries and Old beneficiaries (who have already availed assistance in the year 2023) by Village/Ward Secretariats. | 21.06.2023 to 23.06.2023 |
3 | Completion of Approval/Rejection of Applications by MPDOs/Municipal Commissioners which Village/Ward Secretariats forward. | 21.06.2023 to 25.06.2023 |
4 | Completion of Approval/Rejection of Applications by District Handlooms 8s Textile Officers (DHTOs)/ Assistant Directors (H&T) which MPDOs/Municipal Commissioners forward. | 21.06.2023 to 27.06.2023 |
Generation of Social Audit provisional lists and publishing at the Secretariat level | 28.06.2023 to 29.06.2023 | |
6 | Receiving objections/grievances, if any. | 30.06.2023 to 05.07.2023 |
7 | Generation of final eligible lists | 06.07.2023 to 07.07.2023 |
8 | Approval of final eligible list by District Collector /DLC | 08.07.2023 to 09.07.2023 |
9 | Release of benefit to the beneficiaries by Hon’ble Chief Minister. | As per Govt. instructions. |
ఇక నేతన్న నేస్తం కి సంబంధించి స్టేటస్ మరియు ఇతర లింక్స్ అన్నీ కూడా మీరు కింది పేజ్ ద్వారా రెగ్యులర్ గా ఫాలో అవ్వచ్చు
Leave a Reply