ఈ ఆర్థిక సంవత్సరం రెండో ఆర్థిక ద్రవ్యపరపతి సమీక్షలో ఆర్బిఐ మరోసారి రేపో రేటు ను యదతతంగా 6.5 వద్ద ఉంచింది. దీంతో దేశీయంగా పెద్దగా డిపాజిట్లు మరియు లోన్స్ పై వడ్డీ రేట్లలో మార్పు ఉండే అవకాశం ఉండదు.
ఈ ఏడాది నిత్యవసర ధరలు స్థిరంగానే
ద్రవ్యోల్బణం పై కూడా ఆర్బిఐ గవర్నర్ శక్తికాంత్ దాస్ కీలక వ్యాఖ్యలు చేశారు. ఆర్బిఐ అంచనాలుగు ప్రకారమే నాలుగు శాతం ఏగునె ద్రవ్యాల్ బలం ఉన్నట్లు ఇది ఈ ఏడాది స్థిరంగానే కొనసాగుతున్నట్లు తెలిపారు. తద్వారా నిత్యవసర ధరలు స్థిరంగానే ఈ ఏడాది కూడా కొనసాగనున్నట్లు సమాచారం
2000 నోట్లు 50% వెనక్కి
ఇక సెప్టెంబర్ 30 లోపు 2000 నోట్లను డిపాజిట్ లేదా మార్చుకోవాలని ప్రకటించినటువంటి ఆర్బీఐ ఇప్పటివరకు చాలామందిలో ఉన్నటువంటి 2000 నోట్లను 50% ఉపసంహరించుకున్నట్లు ప్రకటించింది.
500 నోట్లపై రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా క్లారిటీ
దేశవ్యాప్తంగా 2000 రూపాయల ఉపసంహరణ నిర్ణయం తర్వాత 500 రూపాయల నోట్లను ఉపసంహరించే అవకాశం ఉన్నట్లు మీడియాలో ఊహాగానాలు రావడం తెలిసిందే. అయితే వీటికి చెక్ పెడుతూ రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా గవర్నర్ శక్తి కాంత్ దాస్ క్లారిటీ ఇచ్చారు.
500 రూపాయల నోట్లను ఉపసంహరించడం లేదా వెయ్యి రూపాయల నోట్లను ప్రవేశపెట్టడం వంటి ఆలోచన తమకు లేదని తేల్చి చెప్పారు. ఇటువంటి వదంతులను వ్యాపింప చేయవద్దని పౌరులకు మరియు మీడియాను కోరారు.
ఇక గత సమీక్ష మినహిస్తే అంతకుముందు వరుసగా 6 సమీక్షలలో 250 బేసిస్ పాయింట్ల మేర రేపో రేటును పెంచినటువంటి రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా గత సమీక్షలో మరియు ఈసారి సమీక్షలో రేపో రేటును స్థిరంగా కొనసాగించింది. దీంతో ఆర్థిక రంగం దృఢంగా ఉన్నట్లు సంకేతాలు జారీ చేయడం జరిగింది. అదేవిధంగా ద్రవ్యోల్బణం కూడా స్థిరంగానే ఉన్నట్లు ప్రకటించింది.
రూపే ప్రీపెయిడ్ ఫారెక్స్ కార్డుకు అనుమతి
విదేశాలకు ప్రయాణిస్తున్నటువంటి ప్రయాణికులకు సౌకర్యార్థం విదేశాల్లో ఏటీఎం లు, pos మరియు ఆన్లైన్ మర్చంట్ల వద్ద వినియోగించుకునేలా రూపే ప్రీపెయిడ్ ఫారెక్స్ కార్డుల జారిని అనుమతిస్తున్నట్లు రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా గవర్నర్ శక్తి కాంత్ దాస్ వెల్లడించారు. తద్వారా నిర్దేశించినటువంటి బ్యాంకులు ఈ కార్డులను జారీ చేసే అవకాశం ఉంటుంది.
అదేవిధంగా రూపే డెబిట్, క్రెడిట్ , ప్రీపెయిడ్ కార్డులను విదేశీ భూభాగాల్లో కూడా జారీ చేసేందుకు అనుమతించింది.
Leave a Reply