జూన్ ఒకటవ తేదీన వైఎస్ఆర్ రైతు భరోసా అమౌంట్ ను రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేయడం జరిగింది. కర్నూలు జిల్లా పత్తికొండ పర్యటనలో భాగంగా ముఖ్యమంత్రి ఈ అమౌంట్ ను బటన్ నొక్కి ప్రారంభించారు.
వైయస్సార్ రైతు భరోసా అమౌంట్ ₹5500 మాత్రమే ఈసారి జమ చేయడం జరిగింది. PM కిసాన్ అమౌంట్ 2000 రూపాయలు మాత్రం ఈ నెలాఖరులో లేదా వచ్చే నెల మొదటి వారంలో ప్రధానమంత్రి విడుదల చేసిన తర్వాత జమ అవుతుంది.
అయితే ఇప్పటికీ తమ ఖాతాలో రైతు భరోసా అమౌంట్ కూడా జమ కాలేదు అని పలువురు రైతులు రిపోర్ట్ చేస్తున్నారు. కొన్ని జిల్లాల్లో గత రెండు రోజులుగా ఈ అమౌంట్ క్రెడిట్ అవుతున్నట్లు సమాచారం.
కొంత మందికి “Payment Under Processing” అని చూపిస్తుంది. అంటే మీకు ఈ వారంలోనే అమౌంట్ పడుతుంది.
ఈ నేపథ్యంలో రైతుల అవగాహన కోసం రైతు భరోసా అమౌంట్ మీ ఖాతాలో జమ అయిందా లేదా అని తెలుసుకోవడానికి studybizz ద్వారా ఆన్లైన్ పోల్ నిర్వహించడం జరుగుతుంది. మీకు జమ అయితే అయింది అని ఇంకా జమ కాకపోతే ఇంకా పడలేదు అని ఎంచుకోగలరు. దయచేసి సరైన ఆప్షన్ చేయించుకోండి మీరు వేసే ఓటు రైతులకు అవగాహనకు పనికొస్తుంది. అదేవిధంగా పేమెంట్ స్టేటస్ తెలుసుకునే లింక్ కూడా ఈ పేజీ దిగువున ఇవ్వడం జరిగింది చెక్ చేయండి.
రైతు భరోసా పేమెంట్ స్టేటస్ ను కింది లింక్ ద్వారా చెక్ చేయండి
కొంత మందికి “Payment Under Processing” అని చూపిస్తుంది. అంటే మీకు త్వరలోనే అమౌంట్ పడుతుంది. పేమెంట్ మీ ఖాతాలో జమ అయిన తర్వాత స్టేటస్ “Payment Succes” కి మారుతుంది.
Leave a Reply