ఆంధ్రప్రదేశ్ లో ఎనిమిదో తరగతిలోకి ఎంటర్ అయ్యేటటువంటి విద్యార్థులకు రాష్ట్ర ప్రభుత్వం గత ఏడాది నుంచి ట్యాబ్ లను పంపిణీ చేస్తున్న విషయం తెలిసిందే.. ఇందులో భాగంగా ఈ ఏడాది కూడా ఎనిమిదో తరగతిలో అడుగుపెట్టే వారి కోసం రాష్ట్ర ప్రభుత్వం టాబ్లెట్ పంపిణీకి సిద్ధమైంది.
ఆరు లక్షల ట్యాబ్ ల పంపిణీకి కార్యాచరణ
ఈ ఏడాది కూడా ఎనిమిదో తరగతిలో జాయిన్ అయ్యే విద్యార్థుల కోసం మరియు ఉపాధ్యాయులందరికీ రాష్ట్ర ప్రభుత్వం ఆరు లక్షల ట్యాబ్లను పంపిణీ చేసేందుకు కార్యచరణ సిద్దం చేస్తుంది. గత ఏడాది డిసెంబర్ లో ఎనిమిదో తరగతి విద్యార్థులకు 25వేల రూపాయల కంటెంట్ తో పంపిణీ చేసిన ప్రభుత్వం ఈ ఏడాది కూడా అదేవిధంగా కొత్త ట్యాబులను అందించేందుకు సిద్ధమవుతుంది.
ఇక మూడు రోజుల్లోనే రిపేర్
విద్యార్థులకు పంపిణీ చేసినటువంటి ట్యాబ్ కి సంబంధించి ఏమైనా రిపేర్ ఉంటే మూడు రోజుల్లో వాటిని పరిష్కరించేలా ప్రభుత్వం చర్యలు తీసుకుంది.
ఇందుకోసం విద్యార్థుల తల్లిదండ్రులు తమ సచివాలయంలోని డిజిటల్ అసిస్టెంట్ కు repair లో ఉన్న ట్యాబ్ వివరాలు అందించాలి. డిజిటల్ అసిస్టెంట్ సంబంధిత కంప్లీట్ నమోదు చేసుకోవడం జరుగుతుంది. ఇప్పటివరకు డిజిటల్ రసీదులు ఇస్తున్న ప్రభుత్వం ఇకపై మాన్యువల్ రసీదులు కూడా ఇచ్చేందుకు సిద్ధమైంది.
రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి సాంసంగ్ సర్వీస్ సెంటర్లలో వీటిని రిపేర్ చేసే అవకాశం ఉంటుంది.
టాబ్ లను ట్యాంపర్ చేస్తే ఐటి సెల్ కు అలర్ట్
ప్రభుత్వం పంపిణీ చేసిన ట్యాబ్ లో కంటెంట్ ను ఎటువంటి ఇంటర్నెట్ లేకుండా ఉపయోగించుకునే సౌకర్యాన్ని రాష్ట్ర ప్రభుత్వం కల్పించడం జరిగింది. అయితే ఎప్పుడైతే ఎవరైనా wifi కి కనెక్ట్ చేయటం జరుగుతుందో వెంటనే విశాఖపట్నం ఐటీ సెల్ కు అలర్ట్ పోవడం జరుగుతుంది. అదేవిధంగా ట్యాబ్ లో ఏమైనా కంటెంట్ డిలీట్ చేయడానికి లేదా మార్చడానికి ప్రయత్నించినా ఈ వివరాలు కూడా వారికి అందుతాయి. అంతేకాకుండా ఏ విద్యార్థి ఎంత మీరు కంటెంట్ చదివారో ఎప్పుడు చదివారో డేటా కూడా అందులో నిక్షిప్తం అవుతుంది.
Leave a Reply