ప్రస్తుతం వాట్సప్ వాడని వారు ఉండరంటే అతిశయోక్తి కాదు..అంతలా మన లైఫ్ లో వాట్సప్ వాడకం పెరిగిపోయింది. అయితే ఇతర మెసేజింగ్ యాప్స్ నుంచి పెరుగుతున్న కాంపిటీషన్ మరియు యూజర్ల డిమాండ్ ను బట్టి వాట్సప్ కూడా కొత్త ఫీచర్స్ ను పరిచయం చేస్తుంది.
మొత్తం మూడు కొత్త ఆప్షన్స్ ను తెచ్చిన వాట్సప్
ఇటీవల మెసేజ్ ఎడిట్, చాట్ లాక్ ఆప్షన్ ను కొత్తగా తెచ్చిన వాట్సప్ తాజాగా మరో కొత్త ఫీచర్ తీనుంది.
మెసేజ్ ఎడిట్ ఆప్షన్ ద్వారా ఎవరైనా తాము పంపిన మెసేజ్ ను 15 నిమిషాల వరకు ఎడిట్ చేసుకోవచ్చు. మెసేజ్ పైన ఉండే పెన్సిల్ 📝 ఆప్షన్ ను క్లిక్ చేసి 15 నిమిషాల వ్యవధిలో ఎన్నిసార్లు అయినా ఎడిట్ చేసుకోవచ్చు.
ఇక చాట్ లాక్ ఆప్షన్ ద్వారా తమ చాట్ ను ఇతరులు చూడకుండా లాక్ కూడా వేసుకోవచ్చు.
కొత్తగా తెచ్చిన మరో ఆప్షన్ ఏంటంటే
Zoom, Teams మీటింగ్, గూగుల్ మీట్ వంటి వాటిలో వీడియో కాలింగ్ లో భాగంగా వినియోగదారులు స్క్రీన్ షేర్ చేసే ఆప్షన్ ఉంటుంది. అటువంటి ఆప్షన్ ను వాట్సప్ కూడా కొత్తగా తీసుకువచ్చింది. అయితే ప్రస్తుతం బీటా యూజర్స్ కి మాత్రమే ఈ ఫీచర్ అందుబాటులో ఉంది. త్వరలో అందరికీ అందుబాటులోకి తీసుకువస్తామని వాట్సప్ ప్రకటించింది.
Leave a Reply