ఏపీలో స్థిరాస్తుల రిజిస్ట్రేషన్లకు సంబంధించి ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది.. Anywhere Registration (ఎనీ వేర్ రిజిస్ట్రేషన్ ) పాలసీని సవరిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది.
ఎనీ వేర్ రిజిస్ట్రేషన్ (Anywhere Registration) అంటే ఏమిటి
రాష్ట్రంలో గతంలో స్థిరాస్తుల రిజిస్ట్రేషన్ చేసుకోవాలంటే ఆస్తులు ఉన్న ప్రదేశం లోనే సబ్ రిజిస్టర్ కార్యాలయంలో రిజిస్ట్రేషన్ చేసుకోవాల్సి ఉండేది.. అయితే ఆ తర్వాత ప్రభుత్వం ఎనీవేర్ రిజిస్ట్రేషన్ పేరు తోటి కొత్త విధానాన్ని రూపొందించింది. ఈ విధానం ప్రకారం రాష్ట్రంలో ఎక్కడ నుంచైనా రిజిస్ట్రేషన్ చేసుకొని ఆ తర్వాత సిరాస్తి ఉన్నటువంటి సబ్ రిజిస్టర్ కార్యాలయానికి సంబంధిత సబ్ రిజిస్ట్రార్ అనుమతి కోసం డాక్యుమెంట్లను పంపించడం జరుగుతుంది. ఈ అనుమతిని 48 గంటల్లో పొందాల్సి ఉంటుంది. అయితే ఈ ప్రక్రియ వల్ల అవకతవకలు జరుగుతున్నాయని ఆరోపణలు వస్తున్న నేపథ్యంలో ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది.
కొత్తగా ఎనీ వేర్ రిజిస్ట్రేషన్లలో ఏం సవరించారు?
ప్రస్తుతం ఎనీవేర్ రిజిస్ట్రేషన్ లో అవలబిస్తున్న పద్ధతి కి భిన్నంగా ఇకపై రాష్ట్ర వ్యాప్తంగా వినియోగదారుడు ఏ సబ్ రిజిస్ట్రార్ కార్యాలయం నుంచైనా ఆస్తుల రిజిస్ట్రేషన్ చేసుకొని డాక్యుమెంట్లను వెంటనే పొందే అవకాశం కల్పించడం జరిగింది. ఇందుకోసం స్థిరాస్తి ఉన్నటువంటి ప్రాంతం నుంచి కొత్తగా అనుమతి తీసుకోవాల్సిన అవసరం లేకుండా నిబంధనలను రాష్ట్ర ప్రభుత్వం సవరించింది.
స్థిరాస్తులకు సంబంధించి మార్కెట్ విలువలు, నిషేధిత ఆస్తుల జాబితాలన్నీ CARD నెట్వర్క్ లో అందుబాటులో ఉన్న నేపథ్యంలో ఈ ప్రక్రియకు రాష్ట్ర ప్రభుత్వం అనుమతించింది.
ఎప్పటి నుంచి ఈ విధానం అమల్లోకి వస్తుంది?
జూన్ 1 నుంచి ఈ కొత్త నిబంధనలు వర్తిస్తాయని రాష్ట్ర ప్రభుత్వం పేర్కొంది. అన్ని సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాల్లో ఈ కొత్త విధానాన్ని అమలు చేయాలని ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. ఇందుకు సంబంధించినటువంటి డేటాని CARD నెట్వర్క్ లో అప్డేట్ చేయాలని పేర్కొంది. ఇందుకు సంబంధించి డిఐజిలు, జిల్లా రిజిస్ట్రార్లకు ఆదేశాలు జారీ చేసింది.
Leave a Reply