Latest updates
అమ్మ ఒడి ఫీల్డ్ వెరిఫికేషన్ పూర్తి చేయడానికి చివరి తేదీ మే 30.
విద్యార్థి యొక్క తల్లి / తండి మరణించినపుడు guardian details తో update చేసే సమయంలో, ఆ guardian గా పెట్టే వ్యక్తి అమ్మఒడి పథకం నందు వేరే ఇతర Student కి mother /guardian గా ఉండకూడదు.
24 May
అమ్మ ఒడికి సంబంధించి తల్లి వేరే హౌస్ హోల్డ్ మ్యాపింగ్ లో స్టూడెంట్ వేరే హౌస్ లు మ్యాప్ లో ఉన్న వాళ్ళందరినీ Digital Assistant లాగిన్ లో merge ఆప్షన్ ద్వారా కలపవచ్చు.
24 May
అమ్మఒడి 2023-24 field verification కి సంబందించిన childs మొత్తం data/list ని ఒకే excel sheet ద్వారా download చేసుకొనే విధంగా “Reports ≈ R1.6 Ammavodi Discrepancy Report” option enable చేయడం జరిగింది.
Volunteer Cluster ID: అమ్మఒడి 2023-24 కి సంబందించి, filed verification నందు Child/Mother HH ID ఏ వాలంటీర్ cluster కి చెందినదో, ఆ “Volunteer Cluster ID” అనే column కూడా provide చేయడం జరిగింది.
No.of Records per page: Verification list నందు ఇంతకుముందు ఒక page నందు 5 childs names మాత్రమే display అయ్యేవి, ఈ childs records ని 50 childs details ఒకే page లో వచ్చే విధంగా కూడా “No of Records per page” option కూడా provide చేయడం జరిగింది.
AmmVodi Issues FAQ’s will be given. Mean while please complete other cases
అమ్మ ఒడి 2023 4వ విడత కు సంభందించి పూర్తి అర్హతలు మరియు టైమ్ లైన్స్ విడుదల
అమ్మ ఒడి 2023 టైం లైన్స్
EKYC డేటా తేదీ | 25-05-2023 |
EKYC పూర్తి చెయ్యడానికి చివరి తేదీ | 29-05-2023 |
తాత్కాలిక అర్హుల / అనర్హుల జాబితా విడుదల తేదీ | 08-06-2023 |
తుది జాబితా విడుదల తేదీ | 13-06-2023 |
అమ్మ ఒడి అర్హతలు
1. 2022 అక్టోబర్ నుండి 2023 ఏప్రిల్ వరకు తప్పనిసరిగా 75% హాజరు కలిగి ఉండాలి
2. బియ్యం కార్డ్ ఉండాలి.
3. తల్లి మరియు విద్యార్ది ఒకే హౌస్ హోల్డ్ మాపింగ్ లో ఉండాలి.
4. విద్యార్ది EKYC చేయించాలి ( 6 సంII పైన ఉన్న వారికీ ఆదార్ సెంటర్ లో ఫింగర్ అప్డేట్ చేయించాలి.ఫోన్ నెం లింక్ చెయ్యాలి )
5. NPCI చేయించాలి ( తల్లి బ్యాంకు అకౌంట్ కు ఆదార్ ఫోన్ నెం లింక్ అవ్వాలి )
6. బ్యాంకు A/C రన్నింగ్ లో ఉండాలి.
వెల్ఫేర్ అసిస్టెంట్ అందరికీ అమ్మఒడికి సంబందించి ముఖ్య గైడ్లైన్స్
ఇప్పుడే అమ్మఒడి గురుంచి స్టేట్ వైడ్ టీమ్ మీటింగ్ జరిగింది.దానిలో ముఖ్యమైన గైడ్లైన్స్ చెప్పడం జరిగింది.వెల్ఫేర్ అసిస్టెంట్ లు యొక్క NBM లాగిన్ నందు NBM Scheems Module నందు జగనన్న అమ్మఒడి ఫీల్డ్ Verfication ఇవ్వడం జరిగింది. ఈ ఫీల్డ్ వేర్ఫికేషన్ నందు ముఖ్యంగా 4 పాయింట్స్ ఇవ్వడం జరిగింది.
1. Invalid Mother Aadhar :
ఇక్కడ అమ్మఒడికి సంబందించి విద్యార్థి యొక్క మదర్ ఆధార్ తప్పుగా నమోదు అయ్యి ఉంది. ఇక్కడ Edit option మీద క్లిక్ చేసి కరక్టే మదర్ ఆధార్ నమోదు చేసి సబ్మిట్ చేయవలెను.
2. Child and Mother are in Different House Holds
ఇక్కడ విద్యార్థి మరియు మదర్ GSWS వాలంటీర్ లాగిన్ నందు హౌస్ హోల్డ్ వేరు వేరుగా ఉన్నారు. విద్యార్థి యొక్క తల్లి లేదా తండ్రి ఉన్నయెడల వారి హౌస్ హోల్డ్స్ కి విద్యార్థి నీ యాడ్ చేయవలెను. తల్లి, తండ్రి లేని సందర్భం లో Gurden కి హౌస్ హోల్డ్ వేరుగా ఉండవచ్చు.
3. Invalid Child Aadhar :
విద్యార్థి యొక్క కరెక్ట్ ఆధార్ నమోదు చేసి సబ్మిట్ చేయాలి.
4. Same Aadhar for Mother and Child:
విద్యార్థి ఆధార్ మరియు తల్లి ఆధార్ ఒక్కేలా ఉండటం జరిగింది. ఇలాంటి సంద్భాల్లో అక్కడ ఇవ్వబడిన చివరి 4 అంకెల ఆధార్ విద్యార్థి దా లేక తల్లిదా అనేది చెక్ చేసి,ఆ ఆధార్ తల్లిది అయితే విద్యార్థి ఆధార్ నమోదు చేయవలెను. ఆ ఆధార్ విద్యార్థిది అయితే తల్లి ఆధార్ నమోదు చేయవలెను.
పైన పేర్కొన్న instructions Follow అవుతూ వెల్ఫేర్ అసిస్టెంట్ అందరూ ఎటువంటి తప్పులు లేకుండా త్వరగా అమ్మఒడి సర్వే పూర్తి చేయవలెను అని ఆదేశించడం జరిగింది.
Leave a Reply