ఏపి లో అన్ని రైతు భరోసా కేంద్రాల్లో ప్రభుత్వం అందించే సబ్సిడీ వేరు శనగ కాయల కోసం రైతుల
రిజిస్ట్రేషన్ ప్రక్రియ ప్రారంభం అయిందని వ్యవసాయ అధికారులు తెలిపారు.
విత్తనాల కోసం రైతులు తప్పనిసరిగా రిజిస్ట్రేషన్ చేయించుకోవాలని ప్రభుత్వం తెలిపింది. విత్తన వేరుశనగ కాయలు ధరలు ఈ విధంగా ఉన్నాయి. ఒక బస్తా ధర రూ.1,674, రెండు బ్యాగులు ధర రూ,3348, మూడు బ్యాగుల ధర, 5022 రూపాయలు ఉంటుందన్నారు.
ఆయా గ్రామాల పరిధిలోనే రైతు భరోసా కేంద్రాల్లో విత్తనం అవసరమైన రైతులు రిజిస్ట్రేషన్ చేసుకోవాల్సి ఉంటుంది. రిజిస్ట్రేషన్ అయిన వెంటనే రైతులు తమ వాటా డబ్బులు ముందుగానే రైతు భరోసా కేంద్రాల్లో జమ చేయాల్సి ఉంటుందని వ్యవసాయ శాఖ అధికారులు తెలిపారు.
రైతు భరోసా కేంద్రాల వారీగా డిమాండ్ ను అంచనా వేసి
కేటాయింపులను పూర్తి చేయడం జరిగిందని అధికారులు తెలిపారు.
ఒక్కో రైతుకు మూడు బస్తాల సబ్సిడీ వేరుశెనగ విత్తన కాయలు పంపిణీ చేస్తారు. వేరుశనగ ఒక క్వింటా కు పూర్తీ ధర రూ.9300 ఉండగా సబ్సిడీ రూ. 3720పోనూ రైతు వాటా రూ.5580 చెల్లించాల్సి ఉంటుంది. ఒక బస్తా ధరను రూ. 1674 లుగా ప్రభుత్వం నిర్ణయించడం జరిగింది.
రైతులు రిజిస్ట్రేషన్ చేపించేటప్పుడు పట్టాదారు పాసు పుస్తకం జిరాక్స్, ఆధార్ కార్డు జిరాక్స్, సెల్ ఫోన్ తీసుకొని రావాలని తెలిపింది.ఆర్ బి కే సిబ్బందికి నగదు మొత్తం చెల్లించి రసీదు తీసుకోవాలని ప్రభుత్వం తెలిపింది.
ఇది చదవండి: 2000 రూపాయల నోట్లను రద్దు చేసిన రిజర్వ్ బ్యాంక్..FAQ ప్రశ్నలు సమాధానాలు
Leave a Reply