2000 Note Ban FAQ : 2 వేల రూపాయల నోట్ల రద్దు కి సంబంధించి ప్రశ్నలు – సమాధానాలు

2000 Note Ban FAQ : 2 వేల రూపాయల నోట్ల రద్దు కి సంబంధించి ప్రశ్నలు – సమాధానాలు

దేశవ్యాప్తంగా 2000 రూపాయలు నోట్లను ఉపసంహరించుకున్నట్లు, అదేవిధంగా సెప్టెంబర్ 30 వరకు మాత్రమే ఇవి చెల్లుబాటు అవుతాయని ఆ తర్వాత వీటిని రద్దు చేస్తున్నట్లు రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా RBI కీలక ప్రకటన జారీ చేసిన నేపథ్యంలో, ఈ అంశంపై FAQ ప్రశ్నలు సమాధానాలు కింద మీరు చెక్ చేయవచ్చు

FAQ on ₹2000 Note Ban – 2 వేల రూపాయల రద్దు పై ప్రశ్నలు సమాధానాలు

Question ❓: 2000 రూపాయల నోట్లు ఎప్పటి వరకు చెల్లుబాటు అవుతాయి?

– 2000 రూపాయల నోట్లు సెప్టెంబర్ 30 వరకు మాత్రమే చెల్లుబాటు అవుతాయి. ఆ తర్వాత ఇవి చెల్లవు

Question ❓: 2000 రూపాయల నోట్లు ఉన్నవారు ఎం చేయాలి?

– సెప్టెంబర్ 30 లోపు ఏదైనా బ్యాంకు కి వెళ్లి మార్చుకోవడం గానీ, లేదా మీ బ్యాంక్ ఖాతాలో డిపాజిట్ చేసుకోవడం గాని చేయాలి

Question ❓: 2000 రూపాయల మార్చుకోవడం అంటే ఏమిటి? ఏమైనా కాండిషన్స్ ఉన్నాయా?

– 2000 రూపాయల నోటులను ఇచ్చి మీరు ఇతర చెల్లుబాటు అయ్యే నోట్లు పొందవచ్చు. దీనినే మార్చుకోవడం లేదా ఎక్స్చేంజ్ అని అంటారు. అయితే ఒక లావాదేవీకి 20000 రూపాయల వరకు మాత్రమే మీరు మార్చుకునే అవకాశం ఉంటుంది. మీరు మే 23 తర్వాత ఏదైనా బ్యాంకు కి వెళ్లి లేదా రిజర్వ్ బ్యాంక్  ప్రాంతీయ కార్యాలయానికి వెళ్లి మార్చుకోవచ్చు.

Question ❓: ₹2000 ను మార్చుకోవటం కాకుండా వేరే ఏదైనా మార్గం ఉందా?

ఉంది. నోట్లోని మార్చుకునే బదులుగా నేరుగా మీ బ్యాంక్ ఖాతాలో ఎంత అమౌంట్ అయినా మీరు జమ చేసుకోవచ్చు. మార్చుకునేందుకు ప్రతి సారి ₹20,000 షరతులు ఉంటాయి. అయితే డిపాజిట్ చేసుకున్నందుకు ఎటువంటి షరతులు లేవు.

Question ❓: నా దగ్గర చాలా ఎక్కువ నోట్లు ఉంటే ఎలా చేస్తే మంచిది?

– ఎక్కువ నోట్లు ఉన్నవారు ప్రతిసారి 20వేల రూపాయలు మార్చుకోవాలి అంటే కష్టమవుతుంది కాబట్టి, మీకు సాధ్యమైనంత వరకు మార్చుకొని మిగిలినది నేరుగా బ్యాంక్ ఖాతాలో డిపాజిట్ చేసుకోవడం బెటర్.

Question ❓: నోట్లు మార్చుకునేటప్పుడు బ్యాంకులకు ఏమైనా చార్జీలు చెల్లించాలా? ఖాతా ఉండాలా?

– ఎటువంటి చార్జీలు ఉండవు బ్యాంక్ ఖాతా ఉండాలనే నిబంధన కూడా లేదు.

2000 రూపాయల నోట్ల రద్దుకు సంబంధించి మీకు ఇంకా ఏమైనా సందేహాలు ఉంటే కింది కామెంట్ రూపంలో అడగవచ్చు

One response to “2000 Note Ban FAQ : 2 వేల రూపాయల నోట్ల రద్దు కి సంబంధించి ప్రశ్నలు – సమాధానాలు”

  1. ఏపీలో వేరుశనగ విత్తనాల కోసం రిజిస్ట్రేషన్ ప్రారంభం.. కండిషన్స్ ఇవే – GOVERNMENT SCHEMES UPDATES

    […] ఇది చదవండి: 2000 రూపాయల నోట్లను రద్దు చేసిన రిజర్వ్ … […]

You cannot copy content of this page