రాష్ట్రవ్యాప్తంగా మత్స్యకార వృత్తిపై ఆధారపడి జీవిస్తున్న కుటుంబాలకు ప్రతి సంవత్సరం చేపల వేట నిషేధం సమయంలో రాష్ట్ర ప్రభుత్వం అందిస్తున్నటువంటి వైయస్సార్ మత్స్యకార భరోసా వరుసగా ఐదవ విడత అమౌంట్ రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేసింది.
ప్రతి ఏడాది వైఎస్ఆర్ మత్స్యకార భరోసా ద్వారా వీరికి ప్రభుత్వం పదివేల రూపాయలు ఆర్థిక సాయం అందిస్తున్న విషయం తెలిసిందే. అదేవిధంగా డీజిల్ సబ్సిడీ ని కూడా రాష్ట్ర ప్రభుత్వం గత ప్రభుత్వం తో పోలిస్తే పెంచడం జరిగింది.
వరుసగా ఐదో ఏడాది వైయస్సార్ మత్స్యకార భరోసా
రాష్ట్ర వ్యాప్తంగా 1,23,519 మంది మత్స్యకార కుటుంబాలకు పదివేల చొప్పున 123.52 కోట్లను ఈరోజు బాపట్ల జిల్లా నిజాంపట్నం పర్యటనలో భాగంగా బటన్ నొక్కి ముఖ్యమంత్రి జమ చేయడం జరిగింది.
మత్స్యకార భరోసా పేమెంట్ స్టేటస్ ఏ విధంగా చెక్ చేసుకోవాలి [matsyakara bharosa payment status]
మత్స్యకార భరోసా పేమెంట్ స్టేటస్ చెక్ చేసుకునే పూర్తి ప్రాసెస్ మరియు లింక్స్ కింది లింక్ లో ఇవ్వబడ్డాయి. పూర్తి స్టెప్స్ చదివి అదేవిధంగా మీరు మీ ఆధార్ తో మత్స్యకార భరోసా పేమెంట్ స్టేటస్ ని ఆన్లైన్లో ఈజీగా తెలుసుకోవచ్చు.
Leave a Reply