తెలంగాణ లో ఇటీవల విడుదల అయిన పది ఫలితాల్లో సత్తా చాటిన సిద్దిపేట జిల్లా విద్యార్థులకు మంత్రి హరీష్ రావ్ నగదు పురస్కారాలు ప్రకటించారు.
తెలంగాణ వ్యాప్తంగా ఉత్తీర్ణత శాతం గతంలో కంటే మెరుగుపడిందని ఆయన అన్నారు. ఉత్తీర్ణతలో 98.65% తో సిద్దిపేట జిల్లా రెండో స్థానంలో ఉన్నట్లు మంత్రి ప్రకటించారు.
నగదు పురస్కారం కింద ఏమి అందించనున్నారు
జిల్లా లో టెన్త్ ఫలితాలలో 10/10 CGPA సాధించిన విద్యార్థులకు ₹10000 రూపాయల పురస్కారం అందించనున్నట్లు ఆయన తెలిపారు.
10/10 సాదించిన విద్యార్థులు జిల్లాలో 126 మంది ఉన్నారు.
ఇక 100% ఉత్తీర్ణత సాధించిన ప్రభుత్వ పాఠశాలలకు 25 వేల అమౌంట్ ను అందిస్తామని కూడా ఆయన ప్రకటించారు.
జిల్లా వ్యాప్తంగా 100% ఉత్తీర్ణత సాధించిన ప్రభుత్వ పాఠశాలలు మొత్తం 219 ఉన్నాయి.
వీరందరికీ జూన్ మొదటి వారంలో ఈ నగదు పురస్కారం అందిస్తామని ఆయన అన్నారు.
Leave a Reply