ప్రతి ఏటా రెండు నెలల పాటు చేపల వేట నిషేధం కారణంగా ఉపాధి కోల్పోయిన మత్స్యకారుల ఉపాధి కొరకు ప్రభుత్వం 10000 ఆర్థిక సహాయాన్ని మత్స్యకార భరోసా పథకం కింద అందిస్తున్నది.
ఈ ఏటా ఏప్రిల్ 15 నుండి జూన్ 14 వరకు చేపల వేటను నిషేధం చేస్తూ ప్రభుత్వం ఇది వరకే ఉత్తర్వులు జారీచేసింది.
దాంతోపాటు మత్స్యకార భరోసా కి సంబంధించిన టైం లైన్స్ మరియు గైడ్ లైన్స్ తో ఉత్తర్వులు విడుదల చేయడం జరిగింది.
మత్స్యకార భరోసా 2023 24 సంవత్సరానికి గాను ఈ నెల 16 న బాపట్ల జిల్లా నిజాంపట్నంలో ముఖ్యమంత్రి పర్యటనలో భాగంగా నిధులను విడుదల చేయాలని అధికారులకు ఉత్తర్వులు జారీ చేసింది.
Leave a Reply