ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా అంగన్వాడీ కేంద్రాల కు సంబంధించి మౌలిక సదుపాయాలు ఏ విధంగా ఉన్నాయి అదేవిధంగా సదుపాయాల ప్రమాణాలు అన్ని సరిగా ఉన్నాయో లేదో తెలుసుకునేందుకు రాష్ట్ర ప్రభుత్వం ఆడిట్ సర్వే నిర్వహిస్తుంది.
ఇందుకోసం 15 అంశాలతో గ్రామ వార్డు సచివాలయాల ద్వారా సర్వే నిర్వహిస్తున్నారు. ఈ సర్వే నిర్వహించడం కోసం గ్రామ వార్డు సచివాలయ సిబ్బంది కి ఉద్దేశించబడిన Consistent Rythms అనే యాప్ లో ఆడిట్ సర్వేను ఎనేబుల్ చేయడం జరిగింది. అదేవిధంగా ఈ సర్వే ఏవిధంగా చేయాలో కూడా దీనికోసం రాష్ట్ర ప్రభుత్వం ఒక యూజర్ మాన్యువల్ ని రిలీజ్ చేయడం జరిగింది.
ఈ యాప్ మరియు మాన్యువల్ లేటెస్ట్ వర్షన్స్ కోసం కింది లింక్ క్లిక్ చేయండి
ఏ ఏ అంశాలను ఆడిట్ లో సర్వే చేస్తున్నారు?
అంగన్వాడి ఆడిట్లో భాగంగా మౌలిక సదుపాయాలు ఏ విధంగా ఉన్నాయో దానిపైన 15 ప్రశ్నలను రాష్ట్ర ప్రభుత్వం రూపొందించింది. ఇందులో ప్రధానంగా ఫర్నిచర్ అందుబాటులో ఉందా లేదా ఏమైనా రిపేర్ ఉన్నాయా, ఫ్యాన్స్, విద్యుత్, త్రాగు నీటి కనెక్షన్, RO యూనిట్, వైరింగ్, లైట్స్ ఇలా ఏమేమి ఉన్నాయి ఇంకా ఏం కావాలి అన్ని ఇందులో పొందుపరుస్తారు. ఈ సర్వే పూర్తయిన తర్వాత పై అధికారులకు గ్రామ వార్డు సచివాలయాల ద్వారా ఈ డేటాను పంపించడం జరుగుతుంది. నాడు నేడు పథకం పనుల్లో లో భాగంగా వీటికి సంబంధించి అదనంగా నిధులు కేటాయించే అవకాశం ఉంటుంది.
ఇది చదవండి: ఆంధ్రప్రదేశ్ లో అంగన్వాడి ఖాళీల భర్తీకి నోటిఫికేషన్
Leave a Reply