ఆంధ్రప్రదేశ్లో ఐటిఐ, పాలిటెక్నిక్, ఇంజనీరింగ్, డిగ్రీ, ఎంబిబిఎస్ తదితర కోర్సులు చదువుతున్నటువంటి వారందరికీ ముఖ్యమైన అప్డేట్.. వీరికి జగనన్న విద్యా దీవెన కింద ప్రతి ఏటా నాలుగు విడతల్లో చెల్లిస్తున్నటువంటి ఫీజు రియంబర్స్మెంట్ అమౌంటును ఇకపై మూడు విడుతుల్లోనే చెల్లించేలా నిర్ణయం తీసుకున్నట్లు మంత్రి బొత్స సత్యనారాయణ ప్రకటించారు.
ఈ మేరకు మీడియా కాన్ఫరెన్స్లో ఆయన వివరాలను వెల్లడించారు. ప్రస్తుతం నాలుగు విడతల్లో ఏదైతే ఫీజ్ అమౌంట్ ఉంటుందో దాన్ని నాలుగు భాగాలుగా విభజించి ప్రతి విడుదలో ఒక్కొక్క ఇన్స్టాల్మెంట్ లెక్కన అమౌంట్ ఇస్తున్నటువంటి ప్రభుత్వం ఇకపై మూడు మరియు నాలుగు విడతల్లో ఇచ్చే అమౌంట్ కలిపి ఒకేసారి జమ చేయనున్నట్లుగా ఆయన ప్రకటించారు.
ఈ ప్రతిపాదనకు సీఎం కూడా ఆమోదం తెలిపినట్లు ఆయన చెప్పారు. వచ్చే విద్యా సంవత్సరం నుంచి ఈ విధానాన్ని అమలు చేయనున్నట్లు ఆయన ప్రకటించారు.
ఇక బీటెక్ నాలుగో సంవత్సరం పూర్తయినటువంటి విద్యార్థులకు ముఖ్యమైన అప్డేట్ ని కూడా మంత్రి బొత్స తెలిపారు.
నాలుగో సంవత్సరం విద్యార్థులకు విద్యా సంవత్సరం పూర్తయితున్న నేపథ్యంలో , వీరికి కళాశాల నుంచి బయటకు వెళ్లిపోయిన తర్వాత అమౌంట్ వస్తుందా లేదా అని ఆందోళన నెలకొన్న సందర్భంలో బొత్స సత్యనారాయణ క్లారిటీ ఇచ్చారు. వీరికి సర్టిఫికెట్లు తీసుకునే సమయం నాటికి పూర్తి ఫీజు అమౌంట్ ను చెల్లించనున్నట్లు ఆయన ప్రకటించారు.
జగనన్న విద్యా దీవెనకి సంబంధించినటువంటి రెగ్యులర్ అప్డేట్స్ కోసం కింది లింక్ ని ఫాలో అవ్వండి
Leave a Reply