రాష్ట్రంలోని ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ, అగ్రవర్ణాలకు చెందిన పేద విద్యార్ధులు ప్రపంచంలోని టాప్ యూనివర్శిటీలలో ఉన్నత విద్యా కోర్సులు అభ్యసించేందుకు అవసరమైన ఆర్ధిక సాయం అందించడానికి జగనన్న విదేశీ విద్యా దీవెన పేరుతో పథకాన్ని అమలు చేస్తున్నారు.
గత ఏడాది టాప్ 200 విదేశీ యూనివర్శిటీల్లో అడ్మిషన్లు పొందిన 213 మంది విద్యార్ధులకు మొదటి విడత సాయంగా రూ. 19.95 కోట్లను ముఖ్యమంత్రి వైఎస్ జగన్ బటన్ నొక్కి లబ్ధిదారుల ఖాతాలకు జమ చెయ్యడం జరిగింది.
ఎలాంటి కోటాలు లేకుండా అర్హులైన విద్యార్ధులందరికీ సంతృప్త స్ధాయిలో జగనన్న విదేశీ విద్యా దీవెన అందిస్తున్నారు. 2 సీజన్లలో విదేశీ విశ్వవిద్యాలయాల్లో అడ్మిషన్లు, సంబంధిత శాఖల ప్రిన్సిపల్ సెక్రటరీల నేతృత్వంలోని రాష్ట్రస్ధాయి ఎంపిక కమిటీ ద్వారా పూర్తి పారదర్శకంగా విద్యార్ధుల ఎంపిక చేస్తారు.
జగనన్న విదేశీ విద్యా దీవెన 2023 వ సంవత్సరానికి గాను ఆన్లైన్ రిజిస్ట్రేషన్ ప్రారంభమయ్యాయి.
అర్హులైన విద్యార్థులు జ్ఞానభూమి పోర్టల్ ద్వారా రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చు.
రిజిస్ట్రేషన్ చేసుకోవడానికి మే 31వ తేదీ చివరి అవకాశం
Leave a Reply