ఆంధ్రప్రదేశ్ టెన్త్ క్లాస్ పాస్ అయినటువంటి విద్యార్థులకు రాష్ట్ర ప్రభుత్వం గుడ్ న్యూస్ తెలిపింది. Caste Certificate అనగా కుల ధృవీకరణ పొందాలనేకునే 10 వ తరగతి పూర్తి అయిన విద్యార్థులు ఇకపై ఎలాంటి అప్లికేషన్ లేకుండా నిమిషాల్లో క్యాస్ట్ సర్టిఫికెట్లు పొందే అవకాశాన్ని ప్రభుత్వం కల్పించింది.
అంతే కాదు పదో తరగతి పాస్ అయిన కుటుంబంలో ఉన్న వారికి కూడా ఈ అవకాశం లభిస్తుంది.
ఈ విధానం ఎలా పని చేస్తుంది ?
ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా ఉన్నటువంటి రెవెన్యూ శాఖ పదవ తరగతి పాస్ అయినటువంటి విద్యార్థుల జాబితాను గ్రామాల వారీగా క్రోడీకరించి సంబంధిత గ్రామాలకు సంబంధించిన వీఆర్వోలకు పంపించడం జరిగింది. వీరి డేట్ అఫ్ మొత్తం కూడా గ్రామ వార్డు సచివాలయాలకు అనుసంధానం చేయడం జరిగింది.
వీఆర్వోలు తమ లాగిన్ లో వచ్చినటువంటి జాబితాను తమ పరిధిలో ఉన్నటువంటి పదో తరగతి పాస్ అయిన విద్యార్థుల ఇళ్లకు వెళ్లి ఆ విద్యార్థుల కుల ధృవీకరణ ను పూర్తి చేయడం జరిగింది.
విద్యార్థితోపాటు విద్యార్థి కుటుంబంలో ఉన్నటువంటి ఇతర సభ్యులకు కూడా కుల దృవీకరణ పూర్తి చేసి వారి జాబితాలను తమ లాగిన్ లో అప్లోడ్ చేశారు. అదేవిధంగా వారి కుల ధ్రువీకరణ సర్టిఫికెట్ కూడా సిద్ధంగా ఉంచారు.
రాష్ట్ర వ్యాప్తంగా 10 లక్షల మంది పైగా ఈ ఏడాది పదో తరగతి పరీక్షలకు హాజరవ్వగా వీరి కుటుంబ సభ్యులను కూడా పరిక నుంచి సగటున 40 లక్షల మంది డేటాను ప్రస్తుతం సచివాలయాలలో అందుబాటులో ఉంచారు.
ఇకపై నిమిషాల్లో క్యాస్ట్ సర్టిఫికెట్
కాబట్టి పదో తరగతి పాస్ అయినటువంటి విద్యార్థులు ఎవరైతే ఉంటారో తదుపరి పై చదువుల కోసం వారికి కాస్త సర్టిఫికెట్ తప్పనిసరి కాబట్టి వారు ఇకపై నేరుగా గ్రామ వార్డు సచివాలయానికి వెళ్లి నిమిషాల్లో ఈ సర్టిఫికెట్ను పొందవచ్చు.
ఇందుకోసం వారు ఎటువంటి కొత్త అప్లికేషన్ ఇవ్వాల్సిన అవసరం లేదు అదేవిధంగా వెరిఫికేషన్ కూడా చేయాల్సిన అవసరం లేదు.
తద్వారా వెంటనే క్యాస్ట్ సర్టిఫికెట్ ప్రింట్ తీసి ఇచ్చే సౌలభ్యం ఉంటుంది.
వివిధ సంక్షేమ పథకాలకు సంబంధించి అన్ని లేటెస్ట్ అప్లికేషన్ ఫామ్స్ కోసం కింది లింక్ లోకి వెళ్లి డౌన్లోడ్ చేసుకోండి
Leave a Reply