మే నెల పెన్షన్ పంపిణీకి సంబంధించి ముఖ్యమైన సూచనలు

మే నెల పెన్షన్ పంపిణీకి సంబంధించి ముఖ్యమైన సూచనలు

రాష్ట్రంలోని అన్ని వర్గాల సంక్షేమం మరియు అభివృద్ధి సాధించడానికి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అనేక కార్యక్రమాలతో కూడిన “నవరత్నాలు” ప్రకటించింది.

నవరత్నాలలో భాగంగా, సమాజంలోని పేద మరియు బలహీన వర్గాల ప్రత్యేకించి వృద్ధులు మరియు వికలాంగులు, వితంతువులు కష్టాలను తీర్చడానికి ప్రతి నెల 1 వ నుండి 5 వ తేదీ వరకు పెన్షన్ పంపిణీ చేస్తున్నది.

అందులో భాగంగా మే నెల పెన్షన్ పంపిణీ కి సచివాలయం ఉద్యోగులకు మరియు వాలంటీర్లకు సూచనలు జారీ చేసింది.

వైఎస్సార్ పెన్షన్ కానుక పథకానికి సంబంధించి SSPension WEA/WWDs లాగిన్ లో “Unmapped Pensioners Map To Volunteers” ఆప్షన్ ని ఎనేబుల్ చెయ్యడం జరిగింది. 

latest update on 28/04/2023

మే నెల 2023 పెన్షన్ పంపిణి సమాచారం

  • YSR Pension Kanuka Mobile App కొత్తగా వెర్షన్ 2.6కి అప్డేట్ అవ్వటం జరిగింది. అందరు వాలంటీర్లు మరియు WEA/WDS వారు అప్డేట్ చేసుకోగలరు.
  • WEA /WDS /Volunteer లాగిన్లలో Face Recognition ఆప్షన్ ఇవ్వడం జరిగింది . 
  • పెన్షన్దారులందరి eKYC వెరిఫికేషన్ కొరకు Face Recognition ఆప్షన్ ఇవ్వడం జరిగింది. 
  • మరణించిన వారికి రిమార్క్ ఆప్షన్ లో కొత్తగా “Date Of Death” ఆప్షన్ ఇవ్వడం జరిగింది.
  • మే నెల 1 నుంచి పెన్షన్దారులందరికి పెన్షన్ పంపిణీ చేయాలని సీఎం జగన్ సూచించారు.    

పెన్షన్ దారుని మరణ ధ్రువీకరణలో మార్పు:

కొత్తగా పంచాయతీ కార్యదర్శి / వార్డ్ అడ్మిన్ సెక్రటరీ వారి ఆమోదం తప్పనిసరి. WEA/WWDS వారు SS Pension వెబ్ సైట్ / YSRPK App లో పెన్షన్ స్టేటస్ లో Death Capture చేసిన తరువాత ఆ అప్లికేషన్ వారి పంచాయతీ కార్యదర్శి (PS) / వార్డ్ అడ్మిన్ సెక్రటరీ (WAS) వారి లాగిన్ కు ఫార్వార్డ్ అవుతుంది. వారు ప్రొఫైల్ లో ఇచ్చిన మొబైల్ నెంబర్ కు OTP ద్వారా ధ్రువుకరించాలి. ప్రతీ నెల 19 లోపు Death Confirmation చేసిన పెన్షన్ లు ఆ తరువాత నెలలో పెన్షన్ లిస్ట్ లో డిలీట్ అవ్వటం జరుగును.

మే నెలకు సంబంధించి పెన్షన్ పేమెంట్ లకు గాను కొత్తగా ఆధార్ ముఖ ధ్రువీకరణ (Aadar Face Authentication) ఆప్షన్ ను YSR Pension kanuka App లో ఇవ్వటం జరిగింది.Face ఆప్షన్ వెంటనే ఇవ్వబడదు. దానికి గాను పెన్షన్ దారుని బయోమెట్రిక్ / ఐరిష్ ను కనీసం 3 సార్లు ఫెయిల్యూర్ అయిన తరువాత Face ఆప్షన్ చూపించటం జరుగును. Face ఆప్షన్ కూడా 3 సార్లు ఫెయిల్యూర్ అయితే అప్పుడు RBIS కు వెళ్ళటం జరుగును. 

Note :  Face ద్వారా పెన్షన్ ధ్రువీకరణ సమయం లో పెన్షన్ దారుని మొహం పై తగిన లైటింగ్ ఉండేలా చూసుకోవాలి. అదే విధంగా అప్లికేషన్ లో చూపించే విషయాలను ఫాలో అయితే వెంటనే కాప్చర్ చెయ్యటం జరుగును.

పెన్షన్ నగదును గ్రామ వార్డు వాలంటీర్ వారు సాధారణ సెలవులతో సంబంధం లేకుండా నెలలో 1 నుంచి 5వ తేదీ  లోపు పంపిణీ చేయవలసి ఉంటుంది.

వృద్ధులు, వితంతువులు, చేనేత కార్మికులు, కల్లుగీత కార్మికులు, ఒంటరి మహిళలు, మత్స్యకారులు, సాంప్రదాయ చర్మకారులు, ఎయిడ్స్ వ్యాధిగ్రస్తులు వారికి జనవరి 2023 నెల నుంచి నగదును రూ.2500 నుంచి 2750 కు పెంచటం జరిగింది.

పెన్షన్ పంపిణీ పూర్తి అయిన వెంటనే పంచగా  మిగిలిన నగదును వెంటనే సంబంధిత WEA/WWDS వారికి అందజేయవలెను. పెన్షన్ పంపిణీ చివరి తేదీ పూర్తయిన వెంటనే 2 పని దినములలో నగదులు ప్రభుత్వానికి తిరిగి కట్టవలసి ఉంటుంది.

పెన్షన్ నగదు ఏ నెలకు సంబంధించి ఆ నెలకు మాత్రమే విడుదల అవటం జరుగుతుంది.ఆయా నెలకు సంబంధించిన నగదు పెన్షన్ దారుడు తీసుకోకపోయినట్టయితే ఆ నగదు మరుసటి నెల ఆ నెలలో ఇచ్చే పెన్షన్ తో కలిపి ఇవ్వటం జరగదు. పెన్షన్ దారుడు వరుసగా 3 నెలలు పెన్షన్ తీసుకోకపోతే వారిని శాశ్వత వలసదారులుగా పరిగణించడం జరుగుతుంది. తరువాత మూడు నెలల లోపు వారి అర్జీ మేరకు పెన్షన్ పున ప్రారంభించడం జరుగుతుంది.

పెన్షన్ నగదు ప్రతి నెల వారికి నచ్చిన ప్రదేశంలో తీసుకునే వెసులుబాటు పెన్షన్ దారులకు ఉంటుంది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఎవరైనా ఒక ప్రదేశం నుంచి ఇంకొక ప్రదేశానికి వలస వెళ్లినట్లయితే వారు గ్రామా లేదా వార్డు సచివాలయంలో పెన్షన్ ట్రాన్స్ఫర్ అప్లికేషన్ దరఖాస్తు చేసుకుంటే పెన్షన్ ట్రాన్స్ఫర్ అవుతుంది.

Remittance మొదలు రెండు రోజులు దాటిన తరువాత రోజుకు ₹ 100/- లేదా 18% వడ్డీ (ఏది ఎక్కువ అయితే అది ) ఫైన్ విధించబడును. Remittance తేదీ నుంచి 10 రోజులు దాటితే క్రమశిక్షణా చర్యలు తీసుకోబడును.

Startek Scanner Subscription Expire ఐనవారు ACPL యాప్ ఓపెన్ చేసి టాప్ లో రైట్ సైడ్ మూడు డాట్స్ మీద క్లిక్ చేసి Re-Register మీద క్లిక్ చెయ్యండి.

పెన్షన్ పంపిణి సమయంలో ఉపయోగపడే మొబైల్ అప్లికేషన్ లు

Click here to Share

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You cannot copy content of this page