రాష్ట్ర వ్యాప్తంగా ఐటిఐ,పాలిటెక్నిక్, డిగ్రీ, ఇంజనీరింగ్ తదితర కోర్సులు చదువుతున్న వారందరికీ రాష్ట్ర ప్రభుత్వం ప్రతి ఏటా 20 వేల రూపాయలను రెండు విడతల్లో జమ చేస్తున్న విషయం తెలిసిందే. వీరందరికీ గత ఏడాది రెండో విడత పెండింగ్ అమౌంట్ ను రాష్ట్ర ప్రభుత్వం ఏప్రిల్ 26వ తేదీన విడుదల చేయనుంది.
రెండో విడతలో భాగంగా 10,000 రూపాయలు ఖాతాలో జమ చేయనున్నారు.
అనంతపురం జిల్లా సింగనమల నార్సాల పర్యటనలో భాగంగా ముఖ్యమంత్రి ఈనెల 26వ తేదీన ఈ అమౌంట్ను బటన్ నొక్కి తల్లుల ఖాతాలో జమ చేయనున్నారు. పలుమార్లు వాయిదా పడుతూ వచ్చిన జగనన్న వసతి దీవెన కార్యక్రమం ఎట్టకేలకు ఏప్రిల్ 26వ తేదీన విడుదల చేసేందుకు ప్రభుత్వం సన్నాహాలు చేస్తుంది.
ఏర్పాట్లపై కలెక్టర్ సమీక్ష
జిల్లా కలెక్టర్ గౌతమి అధ్యక్షతన ఏర్పాట్లపై టెలికాన్ఫరెన్స్ నిర్వహించడం జరిగింది. ఎటువంటి లోపాలు లేకుండా పకడ్బందీగా ఏర్పాట్లు పూర్తి చేయాలని కలెక్టర్ అధికారులను ఆదేశించారు. ఇప్పటికే ఆమె సభ ప్రాంగణాన్ని గతంలో సందర్శించడం జరిగింది.
హెలిపాడ్ నుంచి సభా ప్రాంగణం వరకు బ్యారికెడ్లు ఏర్పాటు చేయాలని అదే విధంగా సంబంధిత లబ్ధిదారులు విద్యార్థులను బస్సుల్లో తరలించాలని ఆదేశించారు.
ఇక జగనన్న వసతి వెనక సంబంధించి స్టేటస్ మరియు ఇతర లేటెస్ట్ అప్డేట్స్ ను కింది లింక్ ద్వారా చెక్ చేయండి
Leave a Reply