పిల్లలకు రాగి జావ బదులు చిక్కి.. విద్యా శాఖ నిర్ణయం

పిల్లలకు రాగి జావ బదులు చిక్కి.. విద్యా శాఖ నిర్ణయం

ఏపి లో ఒంటి  పూట బడులు అనగా 11.15 వరకు నిర్వహిస్తుండడంతో పిల్లలకు రాగిజావ బదులు చిక్కి ఇవ్వాలని విద్యా శాఖ నిర్ణయించింది.

పిల్లలు ఇంటికి వెళ్లే ముందు మధ్యాహ్నం భోజనం పెడుతున్న నేపథ్యంలో ఆ సమయంలో ఏ రోజైతే రాగిజావ ఇస్తారో అందుకు బదులు చిక్కి ఇవ్వాలని ఈ మేరకు విద్యాశాఖ ఆదేశించింది.

తిరిగి వచ్చే విద్యా సంవత్సరం నుంచి రాగిజావను మెనులో చేర్చాలని నిర్ణయించింది.

శ్రీ సత్య సాయి ట్రస్ట్ ఆధ్వర్యంలో పిల్లలలో కాల్షియం మరియు ఇతర పోషక విలువల పెంచే ఉద్దేశంతో ఇటీవల రాష్ట్ర ప్రభుత్వం జగనన్న గోరుముద్ద బతకంలో భాగంగా చిక్కి ఇవ్వని రోజున రాగిజావ ఇస్తున్న విషయం తెలిసిందే

You cannot copy content of this page