ప్రభుత్వ పథకాల అమలు మరియు పర్యవేక్షణ కోసం ప్రత్యేక అధికారులు

ప్రభుత్వ పథకాల అమలు మరియు పర్యవేక్షణ కోసం ప్రత్యేక అధికారులు

రాష్ట్రంలో అమలవుతన్న ప్రభుత్వ పథకాలు, కార్యక్రమాలను క్షేత్రస్థాయిలో మరింత సమర్థవంతంగా అమలు చేయడానికి ఉన్నతాధికారులతో క్షేత్రస్థాయి సందర్శనలు, తనిఖీలు చేయించాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఇందులో భాగంగా అన్ని జిల్లాలకు ప్రత్యేక సీనియర్ అధికారులను నియమిస్తూ రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది

గత 46 నెలల్లో వైఎస్ జగన్ ప్రభుత్వం ప్రజా సంక్షేమం, అభివృద్ధి కోసం నవరత్నాల పేరుతో అనేక పథకాలను, కార్యక్రమాలను చేపట్టింది. వీటిని పర్యవేక్షించేందుకు ప్రత్యేక అధికారులు నెలలో రెండు సార్లు తమకు కేటాయించిన జిల్లాలను సందర్శించాల్సి ఉంటుంది.

క్షేత్ర స్థాయిలో సంక్షేమ పథకాల అమలుతో పాటు రైతు భరోసా కేంద్రాలు, గ్రామ, వార్డు సచివాలయాలు, విలేజ్ క్లినిక్స్, నవరత్నాలు-పేదలందరికీ ఇళ్లు, భూముల రీ సర్వే.. స్కూళ్లు, ఆస్పత్రుల్లో చేపట్టిన నాడు నేడు కార్యక్రమాలు తదితరాల అమలు తీరును ప్రత్యేక అధికారులు తనిఖీ చేస్తారు. అంగన్వాడీ కేంద్రాలు, స్కూళ్లు, ఆస్పత్రుల్లోని వసతులను పరిశీలిస్తారు. త్వరలో ప్రారంభించనున్న ‘జగనన్నకు చెబుతాం’ కార్యక్రమంలో భాగంగా ప్రజల నుంచి వచ్చే ఫిర్యాదులు, వినతులను పరిష్కరిస్తున్న తీరును పరిశీలన చేస్తారు. ప్రత్యేక అధికారులు తనిఖీలు, పర్యవేక్షణకు వీలుగా సంబంధిత శాఖలన్నీ నమూనా పత్రాలను రూపొందించాలని సీఎస్ ఆదేశించారు.

తనిఖీ నివేదికలను అప్లోడ్ చేసేందుకు ప్రత్యేకంగా యాప్/వెబ్సైట్ను రూపొందించాలని గ్రామ, వార్డు సచివాలయాల శాఖ ప్రత్యేక సీఎసకు సూచించారు. ప్రత్యేక అధికారుల నివేదికలను సంబంధిత శాఖల కార్యదర్శులు, శాఖాధిపతులు, కలెక్టర్లు విశ్లేషించి.. తాముతీసుకున్న చర్యలను ఎప్పటికప్పుడు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శికి సమర్పించాలని స్పష్టం చేశారు.

ప్రత్యేక అధికారులుజిల్లా
గిరిజన సంక్షేమ శాఖ కార్యదర్శిఅల్లూరి సీతారామరాజు
ఆరోగ్య, కుటుంబ సంక్షేమ కమిషనర్అనకాపల్లి
పౌర సరఫరాల కమిషనర్అనంతపురం
అబ్కాబ్ ఎండీఅన్నమయ్య
సాంకేతిక విద్య కమిషనర్బాపట్ల
పౌరసరఫరాల సంస్థ ఎండీచిత్తూరు
సీఆర్డీఏ కమిషనర్తూర్పుగోదావరి
జలవనరుల శాఖ ముఖ్య కార్యదర్శిఏలూరు
సెర్ప్ సీఈవోగుంటూరు
వ్యవసాయ శాఖ ముఖ్య కార్యదర్శికాకినాడ
బీసీ, ఎస్సీ సంక్షేమ శాఖ ముఖ్య కార్యదర్శిడా.బి.ఆర్.అంబేడ్కర్ కోనసీమ
గృహ నిర్మాణ సంస్థ ఎండీ కృష్ణా
రవాణ, రహదారులు-భవనాలు కార్యదర్శికర్నూలు
ఐటీ కార్యదర్శినంద్యాల
వ్యవసాయ శాఖ ప్రత్యేక కమిషనర్శ్రీ పొట్టిశ్రీరాములు నెల్లూరు
వాణిజ్య పన్నుల కమిషనర్ఎన్టీఆర్
పంచాయతీరాజ్ కమిషనర్పల్నాడు
మహిళా శిశు సంక్షేమ శాఖ ముఖ్య కార్యదర్శిపార్వతిపురం మన్యం
వైద్య ఆరోగ్య శాఖ ముఖ్య కార్యదర్శిప్రకాశం
ఏపీ జెన్కో ఎండీశ్రీ సత్యసాయి
మత్స్య శాఖ కమిషనర్పశ్చిమగోదావరి
ఏపిఎంఎస్ఎస్ఐడీసీ ఎండీవైఎస్సార్
సర్వే, సెటిల్మెంట్స్, భూ రికార్డుల కమిషనర్శ్రీకాకుళం
ఉన్నత విద్యా శాఖ ముఖ్య కార్యదర్శితిరుపతి
మున్సిపల్ పరిపాలన కమిషనర్ అండ్ డైరెక్టర్విశాఖపట్నం
పాఠశాల విద్య కమిషనర్విజయనగరం
Click here to Share

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You cannot copy content of this page