జగనన్న వసతి దీవెన రెండో క్వార్టర్ అమౌంటుని రాష్ట్ర ప్రభుత్వం ఈ నెల 17 న విడుదల చేయనుంది.
2022-23 ఆర్థిక సంవత్సరానికి సంబంధించినటువంటి ఈ రెండో క్వార్టర్ అమౌంట్ ని ఇప్పటివరకు విడుదల చేయలేదు
పలుమార్లు వాయిదా వేసుకుంటూ వచ్చినటువంటి ప్రభుత్వం ఎట్టకేలకు ఈ అమౌంట్ను ఏప్రిల్ 17న అనంతపురం జిల్లా సింగనమల పర్యటనలో భాగంగా సీఎం విడుదల చేయనున్నట్లు ప్రకటించింది.
సీఎం పర్యటన నేపథ్యంలో అన్ని ఏర్పాట్లు పగడ్బందీగా చేయాలని కలెక్టర్ గౌతమి ఆదేశించారు. ఈ మేరకు ఆమె ప్రాంగణ స్థలానికి వెళ్లి ఏర్పాట్లు పర్యవేక్షించారు. సింగనమల లోని నార్సాలలో ముఖ్యమంత్రి ఈనెల 17న బటన్ నొక్కి తల్లుల ఖాతాలో అమౌంట్ జమ చేయనున్నారు.
ఈ సందర్భంగా విద్యార్థులతో కూడా ముఖాముఖి నిర్వహించనున్నారు.
జగనన్న వసతి దీవెన పథకం ద్వారా రాష్ట్రంలో ఐటిఐ, పాలిటెక్నిక్, ఇంజనీరింగ్, డిగ్రీ తదితర కోర్సులు చదువుతున్న వారందరికీ ప్రతి ఏటా 20వేల రూపాయలను రెండు దశల్లో తల్లులు ఖాతాలో విడుదల చేస్తున్న విషయం తెలిసిందే.
జగనన్న వసతి దీవెనకి సంబంధించి అన్ని ముఖ్యమైన లింక్స్ మరియు స్టేటస్ లింక్స్ కింది లింక్ ద్వారా చెక్ చేయండి
Leave a Reply