గత రెండేళ్లుగా విపరీతంగా పెరిగిన ఔషధాల ధరలపై కేంద్రం కాస్త వెనక్కి తగ్గి ఎట్టకేలకు వినియోగదారులపై కొంత భారాన్ని తగ్గించింది.
అయితే గత ఆర్థిక సంవత్సరం 10% మేరా పెంచినటువంటి మందుల ధరలను ఈ ఆర్థిక సంవత్సరం అంటే ఏప్రిల్ ఒకటి నుంచి ఏకంగా 12 శాతం పెంచుతూ కేంద్రం నిర్ణయం తీసుకోవడం సార్వత్రా చర్చనియాంశంగా మారింది. అయితే కొంతమేర వినియోగదారుల పై భారం తగ్గించేందుకుగాను కేంద్రం తాజాగా అత్యవసర ఔషధాలు (essential medicines) జాబితాలో ఉన్నటువంటి 870 ఔషధాలకు గాను 651 ఔషధాలపై ceiling విధించింది.
ఈ నిర్ణయం తో ఈ ఔషధాల ధరలు దాదాపు 7 శాతం వరకు తగ్గాయి. ఈ మేరకు ఔషధ ధరల నియంత్రణ సంస్థ నేషనల్ ఫార్యాస్యూటికల్స్ ప్రైసింగ్ అథారిటీ (ఎన్‌పీపీఏ) వెల్లడించింది.
ఇక ఏప్రిల్ ఒకటి 12.12శాతం పెరగాల్సి ఉన్న ఈ మందులు.. ఈ సీలింగ్ నిర్ణయంతో.. వీటి ధరలు 6.73శాతం దిగొచ్చాయి. ఈ తగ్గింపుతో వినియోగదారులపై కొంతమేర భారం తగ్గించినట్లు అయింది.
అసలు ఈ ceiling అంటే ఏమిటి?
సీలింగ్ అంటే కొంత పరిమితిని కేంద్రం నిర్ణయిస్తుంది. ఆ గరిష్ట ధరలు మించి ఏ ఔషద కంపెనీలు మందులను విక్రయించకూడదు.
ఏదేమైనా ఈ ఏప్రిల్ 1 నుంచి 12% ధరలు పెరిగితే సామాన్య ప్రజలు చాలా అవస్థలు పడేవారు అయితే తాజా నిర్ణయం తో కొంత ఊపిరి పీల్చుకున్నట్లు అయింది.
Leave a Reply