ఏపి లో పట్టణ స్థానిక సంస్థలు, మున్సిపాలిటీలు, కార్పొరేషన్లలో ఆస్తి పన్ను ముందస్తు చెల్లింపుదారులకు మొత్తం పన్నులో 5 శాతం రిబేటు ఇవ్వనున్నట్టు మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ విభాగం ప్రకటించింది.
ఏప్రిల్ 30వ తేదీలోగా చెల్లించే వారికి ఈ అవకాశం కల్పిస్తున్నట్లు పేర్కొంది.
ఆన్లైన్ విధానంలో పన్ను చెల్లించే వారి కోసం మొత్తం పన్నులో ప్రభుత్వం ప్రకటించిన తగ్గింపును మినహాయించేలా ఈ-మున్సిపల్ ఈఆర్పీ అప్లికేషన్లో మార్పులు చేయనున్నారు.
అందుకోసం ఏప్రిల్ 1 నుంచి మూడు రోజులపాటు వెబ్సైట్ నిలిపివేయనున్నట్లు అధికారవర్గాలు తెలిపాయి.
ఏప్రిల్ 4 నుంచి కింది వెబ్సైట్ ద్వారా మీరు ఆస్తి పన్ను అనగా ప్రాపర్టీ టాక్స్ ను చెల్లించవచ్చు
గ్రామ వార్డు సచివాలయాల లో కూడా నేరుగా ప్రాపర్టీ టాక్స్ ను చెల్లించవచ్చు.
Leave a Reply