తెలంగాణలోని రైతులకు రాష్ట్ర ప్రభుత్వం గుడ్ న్యూస్ తెలిపింది. యాసంగి సీజన్లో పండించినటువంటి ధాన్యాన్ని ఏప్రిల్ మూడో వారం నుంచి కొనుగోలు ప్రారంభించాలని నిర్ణయించింది.
ఏప్రిల్ 21 నుంచి యాసంగి ధాన్యం సేకరణ
రాష్ట్రంలో ఈ ఏడాది సుమారు 57 లక్షల ఎకరాల్లో వరి పంట సాగు అయినట్లు ప్రభుత్వం ప్రాథమికంగా గుర్తించింది. ఈ మేరకు ఈ ఏడాది సుమారు 1.3 కోట్ల మెట్రిక్ టన్నుల ధాన్యం దిగుబడి వచ్చి ఉంటుందని ప్రభుత్వం అంచనా వేస్తుంది. ఈ మేరకు ఏప్రిల్ 21 నుంచి ధాన్యం సేకరణకు కొనుగోలు కేంద్రాలను ప్రభుత్వం తెరవనుంది.
దీనిపై మరోసారి పర్యవేక్షించేందుకు ఏప్రిల్ 9 లేదా 10న మరోసారి మంత్రులు భేటీ కానున్నారు. దాన్యం సేకరించడానికి సంబంధించి ఇప్పటికే గన్నీ సంచుల సేకరణ కూడా ప్రారంభించడం జరిగింది.
2 responses to “TS: తెలంగాణలో రైతులకు గుడ్ న్యూస్.. ఏప్రిల్ మూడో వారం నుంచి యాసంగి ధాన్యం కొనుగోలు”
ఈ ఏడాది యసంగీ 2023 సబందిచిన 10 ఎకరాల నుండి 15 ఎకరాల లోపు భూమి ఉన్న రైతులకు రైతు బందు సహాయం అందలేదు.. కావున సంబంధిత అధికారులు రైతు బందు సహాయం అందించే విధంగా చర్యలు తీసుకోవాలని రైతులు డిమాండ్ చేస్తున్నారు..
పట్టా భూమి కి మాత్రమే ఎంత పంట ఎంత వరి వేశారని రాసి కానీ పోడు భూములు లో బతుకుతున్న రైతులకు ఏమాత్రం పంట అనేది వేశారో అధికార అధికారులకు తెలియదు మా పంట రాయమంటే మీకు పాస్బుక్ లేదు అది మాకు తెలియదని అధికారులు చెప్తున్నారు దయచేసి మా పోడు పట్టాలు ఇవ్వాలని ఈ న్యూస్ ద్వారా తెలియజేస్తున్నాం