వైఎస్సార్ ఆసరా మూడో విడత అమౌంట్ ను రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేసింది. మార్చ్ 25 నుంచి ఏప్రిల్ 5 వరకు ఉత్సవాలను కూడా ప్రభుత్వం నిర్వహిస్తుంది. అయితే చాలా మంది తనకు ఇంకా రుణ మాఫీ అమౌంట్ పడలేదు అని కంగారు పడుతున్నారు. ఎందుకు ఇంకా అమౌంట్ పడలేదు, ఎప్పుడు పడుతుంది అనే దానిపై పూర్తి వివరాలు మీకోసం
దశల వారీగా అమౌంట్ విడుదల చేస్తున్నారు
గత ఏడాది మాదిరిగా నే ఈ ఏడాది కూడా ఆసరా ఉత్సవాలను రాష్ట్ర ప్రభుత్వం నిర్వహిస్తుంది. మార్చి 25 న ముఖ్యమంత్రి బటన్ నొక్కి ఈ కార్యక్రమం ప్రారంభించినప్పటికి అమౌంట్ మాత్రం ఏప్రిల్ 5 లోపు పడనుంది.
వైఎస్ఆర్ ఆసరా సంబంధించి ప్రాంతాల వారీగా చెక్కుల పంపిణీ కార్యక్రమం కొనసాగుతుంది.జిల్లాలు,మండలాల వారీగా మంత్రులు, ఎమ్మెల్యేలు, అధికారులు ఈ కార్యక్రమంలో పాల్గొంటున్నారు. ఈ కార్యక్రమాలలో పెద్ద ఎత్తున డ్వాక్రా మహిళల ను భాగస్వామ్యం చేస్తున్నారు.
ఆసరా అమౌంట్ మీ ప్రాంతంలో చెక్కుల పంపిణీ తేదీని బట్టి ఏప్రిల్ 5 లోపు ఏ రోజైనా మీ ఖాతా లో జమ అయ్యే అవకాశం ఉంది.
కాబట్టి మీరు అర్హులు అయితే ఏప్రిల్ 5 వరకు వేచి చూడండి.
ఎలాంటి రుణాలను అసలు ఈ మాఫీ వర్తిస్తుంది?
ఏప్రిల్ 11 2019 లోపు తీసుకుని సకాలంలో వాయిదాలు చెల్లించే లోన్ లకు మాత్రమే ఈ రుణ మాఫీ వర్తిస్తుంది. అది కూడా 2019 ఏప్రిల్ నాటికి మీ రుణం ఇంకా ఎంత చెల్లించాల్సి ఉందో ఆ outstanding అమౌంట్ ని మాత్రమే ప్రభుత్వం నాలుగు విడతల్లో మాఫీ చేస్తుంది. అంటే ఆ అమౌంట్ ని నేరుగా మహిళా సంఘాల పొదుపు ఖాతాలో జమ చేస్తుంది.
మీరు గ్రామీణ ప్రాంతానికి చెందిన వారై, మీ లోన్ ఎప్పుడు తీసుకున్నారు, ఈ పథకానికి ఎలిజిబుల్ ఆ కాదా కింది లింక్ లో చూడవచ్చు. [పట్టణ ప్రాంతం వారి డీటైల్స్ ప్రస్తుతం అధికారుల లాగిన్ లో మాత్రమే చూడవచ్చు]
మీకు ఇంకా ఏమైనా డౌట్స్ లేదా మీ అర్హత కి సంబంధించి అనుమానాలు ఉంటే, మీ serp లేదా mepma అధికారులను సంప్రదించవచ్చు.
4 responses to “YSR ఆసరా అమౌంట్ పడలేదా? ఈ డీటైల్స్ చెక్ చేయండి”
ysr aasara amount enka padaledu. list lo name unna kuda money raledu ani cheptunnaru.
Varshini mahila group
గతంలో రెండు సార్లు అమౌంట్ ఇచ్చారు. కానీ ఈ సారి అర్హుల జాబితాలో నా పేరు లేదు. ఎందుకు అలా అయ్యింది? ఏమి చెయ్యాలి? చెప్పగలరు
VO or Serp అధికారులను కాంటాక్ట్ అవ్వండి