ప్రతి ఏటా ఏప్రిల్ ఒకటి తర్వాత సాధారణంగా విద్యుత్ చార్జీలను పెంచుతూ వస్తున్నటువంటి ప్రభుత్వాలు, ఈసారి తెలుగు రాష్ట్రాల విద్యుత్ వినియోగదారులకు భారీ ఊరట ను కల్పించాయి.
ఈ సారి విద్యుత్ చార్జీలు పెంచము
ఈ ఏడాది వినియోగదారుల పై విద్యుత్ భారం మూపబోమని ఏపి ERC మరియు తెలంగాణ ప్రభుత్వం ప్రకటించాయి.
ఏపీలో విద్యుత్ చార్జీల భారాన్ని ప్రభుత్వమే భరిస్తుందని ఏపీఈఆర్సి చైర్మన్ తెలిపారు. ఇప్పటికే SC,ST లకు 200 యూనిట్ల సబ్సిడీ, నాయి బ్రాహ్మణులు, ఆక్వా రంగం కి సంబంధించిన రాయితీలను ప్రభుత్వం భరిస్తున్న విషయం తెలిసిందే. ఈ మేరకు 10135.22 కోట్ల అదనపు భారం ప్రభుత్వం భరించేందుకు ముందుకు వచ్చినట్లు ఆయన తట్టించారు.
మరోవైపు తెలంగాణలో ట్రూ ఆఫ్ చార్జీల మోత ఉండదని, 12,718 కోట్ల ఆధనపు భారాన్ని తెలంగాణ ప్రభుత్వమే భరిస్తుందని సీఎం కేసీఆర్ స్పష్టం చేశారు. ఈ మేరకు విద్యుత్ నియంత్రణ మండలికి సీఎం తెలిపారు. అదేవిధంగా ప్రార్థన స్థలాలకు సంబంధించి యూనిట్ కు ఐదు రూపాయలు మాత్రమే వసూలు చేయనున్నట్లు తెలిపారు.
Leave a Reply