ఏపి లో రాజధాని ప్రాంత అభివృద్ధి ప్రాధికార సంస్థ (సీఆర్‌డీఏ) ముఖ్యమైన ప్రకటన జారీ చేసింది. మంగళగిరిలోని నవులూరు వద్ద మధ్య ఆదాయ వర్గాల కోసం వేసిన జగనన్న స్మార్ట్ టౌన్ షిప్ MIG లేఅవుట్ల లో ప్లాట్ల కొనుగోలు సంబంధించి సీఆర్‌డీఏ మరోమారు ప్రకటన జారీ చేసింది.
ఏపి లోని ప్రభుత్వ ఉద్యోగులు రాష్ట్రంలో ఎక్కడి వారైనా సరే ఈ ప్లాట్లు కొనుగోలు చేయొచ్చని CRDA తెలిపింది. లేఅవుట్ వేసి రెండేళ్లు గడుస్తున్నా అనుకున్న స్థాయిలో స్పందన లేకపోవడంతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపింది.
జగనన్న లేఔట్లలో ప్రభుత్వ ఉద్యోగులకు డిస్కౌంట్
జగనన్న లేఅవుట్ల లో ప్రభుత్వ ఉద్యోగులకు 10శాతం ప్లాట్లను కేటాయిస్తున్నట్లు తెలిపింది. ఈ ప్లాట్లలో 20శాతం డిస్కౌంట్ కూడా ఇవ్వనున్నట్లు సీఆర్‌డీఏ కమిషనర్ ప్రకటనలో తెలిపడం జరిగింది. MIG లేఅవుట్‌లో 200 చదరపు గజాల ప్లాట్లు 58, 240 చదరపు గజాల ప్లాట్లు 188 ప్రస్తుతం అందుబాటులో ఉన్నాయని వెల్లడించారు. ప్లాట్‌లలో చదరపు గజానికి రూ.17,499గా ధర నిర్ధారించగా.. ఒకేసారి చెల్లిస్తే ఇందులో 5 శాతం రాయితీ ఇస్తామని పేర్కొన్నారు. 40శాతం అభివృద్ధి ధరపై రిజిస్ట్రేషన్ ఛార్జీలను కూడా మినహాయింపు ఉంటుందని తెలిపారు.
అసలు జగనన్న స్మార్ట్ టౌన్షిప్ అంటే ఎంటి?
మధ్య తరగతి వారికి ఇళ్ల స్థలాలను తక్కువ ధరికే అందించే ఉద్దేశంతో రాష్ట్ర ప్రభుత్వం స్వతహాగా తీసుకువచ్చినటువంటి పథకమే జగనన్న స్మార్ట్ టౌన్షిప్ పథకం.
ఈ పథకానికి సంబంధించి అప్లికేషన్ లింక్, అప్డేట్స్ మరియు పూర్తి వివరాలు కింది లింక్ లో చూడవచ్చు
Leave a Reply