ఏపి లో గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ (పట్టభద్రుల) స్థానాలకు సంబంధించి ఓటింగ్ ప్రక్రియ ముగిసింది. మొత్తం మూడు స్థానాలలో టీడీపీ విజయం సాధించింది. ఇక ఉపాధ్యాయ స్థానాలలో వైసిపి గెలుపొందింది.
ఉత్తరాంధ్ర పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల రిజల్ట్
ఇందులో, ఉత్తరాంధ్ర పట్టభద్రుల ఎమ్మెల్సీ స్థానానికి సంబంధించి తెలుగు దేశం అభ్యర్థి వేపాడా చిరంజీవి రావు గెలిచారు. 8 రౌండ్ల మొదటి ప్రాధాన్యత ఓట్ల లెక్కింపు పూర్తయ్యేసరికి టీడీపీ అభ్యర్థి వేపాడ చిరంజీవిరావు, వైసిపి అభ్యర్థి సీతంరాజు సుధాకర్ పై 27,315 ఓట్ల స్పష్టమైన ఆధిక్యంలో చూపించారు. రెండో ప్రాధాన్యత ఓట్ లో ఆయనకు కావాల్సిన 94,509 ఓట్స్ లభించాయి.
మొదటి ప్రాధాన్యత ఓట్ లోనే టీడీపీ అభ్యర్థికి 82,958, వైకాపా అభ్యర్థికి 55,749, పీడీఎఫ్ అభ్యర్థి రమాప్రభకు 35,148, భాజపా అభ్యర్థి పీవీఎన్ మాధవ్‌కు 10,884 ఓట్లు వచ్చాయి. మొత్తం 8 రౌండ్లలో ఈ లెక్కింపు జరిగింది.
తూర్పు రాయలసీమ గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల రిజల్ట్
తూర్పు రాయలసీమ[ప్రకాశం,నెల్లూరు,చిత్తూరు] పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల స్థానంలో కూడా టీడీపీ గెలిచింది. రెండో ప్రాధాన్యత ఓట్లు కలిపి, టీడిపి అభ్యర్ధి కంచర్ల శ్రీకాంత్ కు 1,12,686 ఓట్స్ వచ్చాయి. వైసీపీ అభ్యర్థి శ్యామ్ ప్రసాద్ రెడ్డి కి 85423 వచ్చాయి. ఏడు రౌండ్స్ మొదటి ప్రాధాన్యత ఓట్ల లో తెలుగు దేశం అభ్యర్థి కంచర్ల శ్రీకాంత్ 27,262 ఓట్ల లీడ్ లీడ్ సాధించారు.
పశ్చిమ రాయలసీమ గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల రిజల్ట్
పశ్చిమ రాయలసీమ [కర్నూల్, కడప, అనంతపూర్] పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో వైసీపి అభ్యర్ధి వెన్నపూస రవీంద్ర రెడ్డి పై టీడిపి అభ్యర్ధి భూమి రెడ్డి రామగోపాల్ రెడ్డి 7,543 వేల మెజారిటీ తో గెలుపొందారు. తెలుగుదేశం అభ్యర్థి రామగోపాల్ రెడ్డికి 1,09,781 ఓట్లు రాగా, వైకాపా అభ్యర్థి వెన్నపూస రవీంద్రారెడ్డికి 1,02,238 ఓట్లు పోలయ్యాయి.
ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికల అప్డేట్
టీచర్స్ MLC స్థానంలో ప్రధాన ప్రతిపక్షం టీడీపీ నేరుగా అభ్యర్ధులను బలపరచలేదు. దీంతో ప్రధాన పోరు వైసిపి,APTF – PDF, బీజేపీ మధ్య సాగింది. రెండు స్థానాల్లో వైసిపి సునాయాసంగా గెలిచింది.
అనంతపురం టీచర్స్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో వైకాపా బలపరిచి అభ్యర్థి రామచంద్రారెడ్డి , APTF అభ్యర్థి ఒంటేరు శ్రీనివాస రెడ్డి పై 169 ఓట్ల స్వల్ప మెజారిటీ తో గెలుపొందారు. మూడో ప్రాధాన్యతా ఓటుతో ఆయన గెలిచినట్లు ఎన్నికల అధికారి కేతన్‌గార్గ్ ప్రకటించారు.
తూర్పు రాయలసీమ టీచర్ ఎమ్మెల్సీ స్థానంలో కూడా వైకాపా మద్దతు తెలిపిన అభ్యర్థి చంద్రశేఖర్‌రెడ్డి సుమారు 2వేల ఆధిక్యంతో గెలుపొందారు.
ఎప్పటికప్పడు లేటెస్ట్ రిజల్ట్స్ ఇదే లింక్ లో అప్డేట్ చేయబడతాయి.
Leave a Reply