ఆంధ్రప్రదేశ్ లో ప్రతి నెల ఒకటో తేదీ నుంచి ఐదో తేదీ వరకు పెన్షన్ పంపిణీ చేస్తున్న విషయం తెలిసిందే. ప్రతిసారి ఒకటో తేదీ తెల్లవారుజామున వాలంటీర్లు ఇంటింటికి వెళ్లి పెన్షన్ పంపిణీ అమౌంట్ అందించడం జరుగుతుంది.
ఈసారి పెన్షన్ పంపిణీ ఏప్రిల్ 3 నుంచి..ఎందుకంటే?
అయితే ఎప్పటిలా కాకుండా ఈసారి అంటే ఏప్రిల్ నెల పెన్షన్ పంపిణీ అమౌంట్ ని ఏప్రిల్ 3 నుంచి పంపించేయనున్నట్లు క్యాబినెట్లో నిర్ణయించడం జరిగింది. ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వం సంబంధిత శాఖలకు ముందస్తు ఆదేశాలు జారీ చేసింది.
ఎందుకు రెండు రోజులు వాయిదా పడిందంటే, ఈసారి ఏప్రిల్ 1 వ తేదీ RBI – రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ద్వారా ప్రకటించబడిన సెలవు దినం, అదేవిధంగా ఏప్రిల్ 2 న ఆదివారం కావడంతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలియజేయడం జరిగింది.
ఎందుకు ఏప్రిల్ 1వ తేదీన సెలవు?
బ్యాంకులకు ఆర్థిక లావాదీవీలకు సంబంధించినటువంటి సంవత్సరం ఏప్రిల్ ఒకటి నుంచి మార్చి 31 వరకు ఉంటుంది.
బ్యాంకులు తమ వార్షిక లెక్కలను మార్చి 31 తో ముగిస్తాయి అనగా కొత్త క్యాలెండర్ ఏప్రిల్ ఒకటి నుంచి ప్రారంభమవుతుంది కావున year end activities మరియు బిగినింగ్ ఆఫ్ ద ఇయర్ అనగా వార్షిక లెక్కల ముగింపు ఆక్టివిటీస్ ఉండటం కారణంగా వాటి సెటిల్మెంట్ కోసం ఏప్రిల్ ఒకటిని సెలవు దినంగా ప్రకటించడం జరుగుతుంది. ఆరోజు చాలా బ్యాంకులు మూసివేసి ఉంటాయి. అయితే అంతర్గత లావాదేవీలు మాత్రం సిబ్బంది ద్వారా జరుగుతూ ఉంటాయి.
ఈ కారణంగా పెన్షన్ అమౌంట్ ను బ్యాంకులు రిలీజ్ చేయడం కష్టం కాబట్టి ఆరోజు మరియు మరుసటి రోజు ఆదివారం ఉండటంతో ఏప్రిల్ 3 నుంచి పెన్షన్ పంపిణీ చేయాలని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నిర్ణయించింది.
Leave a Reply