ఏపి లో గ్రామ వార్డు సచివాలయాల చట్టబద్ధత బిల్లు 2023 ఆమోదం. అసలు ఈ బిల్ ఎంటి? పూర్తి వివరాలు

ఏపి లో గ్రామ వార్డు సచివాలయాల చట్టబద్ధత బిల్లు 2023 ఆమోదం. అసలు ఈ బిల్ ఎంటి? పూర్తి వివరాలు

గ్రామ వార్డు సచివాలయాల ఉద్యోగులకు ఎట్టకేలకు గుడ్ న్యూస్.. రాష్ట్రవ్యాప్తంగా 15004 గ్రామ వార్డు సచివాలయంలో పనిచేస్తున్న సుమారు 1.34 లక్షల మంది ఉద్యోగుల చట్టబద్ధతకు సంబంధించి కీలక గ్రామ వార్డు సచివాలయాల చట్టబద్ధత బిల్లు 2023 కు కేబినెట్ ఆమోదముద్ర వేసింది.

అసలు ఏంటి ఈ బిల్లు? ఎప్పుడు ఆమోదిస్తారు?

ప్రస్తుత ప్రభుత్వం కలువు దీరిన తర్వాత ప్రతి గ్రామ వార్డ్ సచివాలయాల ద్వారా ప్రజలకు సేవలను మరింత మెరుగైన 7 అందించాలని ఉద్దేశంతో ప్రభుత్వం గ్రామ వార్డు సచివాలయం ప్రారంభించడం జరిగింది.

అప్పట్లో ప్రభుత్వం నాలుగు నెలల్లో 1.34 లక్షల మందిని ఈ గ్రామ వార్డు సచివాలయాలకు సంబంధించి ఉద్యోగులుగా నియమించడం జరిగింది.

సంక్షేమ పథకాల అమలుతో ప్రారంభమైన ఈ గ్రామ వార్డు సచివాలయాల వ్యవస్థ ప్రస్తుతం 545 రకాల సేవలను ప్రజలకు అందిస్తుంది.

ఇందులో సంక్షేమ పథకాలే కాకుండా వివిధ సర్టిఫికెట్ల జారీ, ఆధార్ సేవలు మరియు బిల్లుల చెల్లింపు వంటివి కూడా ఉండటం విశేషం.

ఇటీవల ఈ గ్రామ వార్డు సచివాలయ ఉద్యోగుల probation ముగిసింది. తద్వారా వీరిని శాశ్వత ఉద్యోగులుగా పరిగణించడం జరిగింది.

అయితే ఇప్పటికీ వీరికి చట్టబద్ధత పూర్తిస్థాయిలో లేదు. ప్రస్తుతం ఆర్డినెన్స్ ద్వారానే ఈ గ్రామ వార్డు సచివాలయాలను నిర్వహిస్తున్నారు.

ఇకపై వీరికి పూర్తి చట్టబద్ధత కల్పిస్తూ రాష్ట్ర ప్రభుత్వం బడ్జెట్లో గ్రామ వార్డు సచివాలయాల చట్టబద్ధత బిల్లు 2023ను ప్రవేశపెట్టాలని నిర్ణయించింది. ఈ మేరకు బడ్జెట్ కంటే ముందు శుక్రవారం జరిగిన క్యాబినెట్ సమావేశంలో ఆమోదముద్ర వేయడం జరిగింది.

ఇక తదుపరి బడ్జెట్ సమావేశాల్లో ఈ బిల్లును ప్రవేశపెట్టనున్న ప్రభుత్వం, అత్యధిక మెజారిటీ ఉన్న కారణంగా ఈ బిల్లును ఆమోదించడం జరుగుతుంది. తద్వారా ఇకపై గ్రామ వార్డు సచివాలయాలకు పూర్తి చట్టబద్ధత లభించనుంది. తద్వారా ప్రభుత్వ ఉద్యోగులకు లభించే అన్ని రూల్స్ మరియు అలోవెన్సెస్ వీరికి కూడా పూర్తి స్థాయిలో శాశ్వత ప్రాతిపదికన వర్తిస్తాయి.

You cannot copy content of this page