కేంద్ర ఎన్నికల సంఘం కీలక నిర్ణయం తీసుకుంది.
త్వరలో కర్ణాటక అసెంబ్లీ ఎన్నికలు సమీపిస్తున్న వేళ ఈ నిర్ణయం వెలువడింది.
ఇకపై 80 ఏళ్ల దాటిన వృద్దులకు మరియు దువ్యాంగులకు ఇంటి నుంచి ఓటు హక్కు కల్పిస్తూ నిర్ణయం తీసుకుంది.
ఏ విధంగా ఇంటి నుంచి ఓటు వేస్తారు?
ఇంటి నుంచి ఓటు వేసేందుకు నమోదు చేసుకున్న 80 ఏళ్ళు దాటిన వృద్ధులకు మరియు దివ్యాంగులకు స్వయంగా ఎన్నికల కమిషన్ తరపున ఒక బృందం వారి ఇంటికి వెళ్తుంది.
వారి వద్దకు ఫామ్ 12 D పత్రాలను తీసుకువెళ్లి ఓటు నమోదు చేసుకుంటారు.
ఈ మొత్తం ప్రక్రియ అంతా కూడా రికార్డ్ చేయనున్నట్లు ఎన్నికల కమిషనర్ తెలిపారు. అయితే ఎవరికి ఓటు వేశారు అనేది గోప్యంగా నే ఉంచుతామని చెప్పారు.
ఎప్పటి నుంచి అమలు చేయనున్నారు
రానున్న కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల సమయం నుంచి ఈ పద్ధతిని అమలు చేయనున్నట్లు కేంద్ర ప్రధాన ఎన్నికల కమిషనర్ CEC రాజీవ్ కుమార్ తెలిపారు.
ఈ ఆర్టికల్ పై మీ ఒపీనియన్ ఏమైనా ఉంటే కింద కామెంట్ చేయగలరు.
Leave a Reply