గ్రామ వార్డు వాలంటీర్ల విధుల విషయంలో మరోసారి విచారణ జరిపిన హైకోర్టు ప్రభుత్వం పై అసంతృప్తి ప్రకటించింది.
వైఎస్ఆర్ చేయూత పథకం కింద గతంలో లబ్ధిదారులుగా ప్రయోజనం పొందామని,
రాజకీయ కారణాలతో తమను అర్హతల నుంచి వాలంటీర్లు తమను తొలగించారని పేర్కొంటూ గుంటూరు జిల్లా పెదకూరపాడు మండలం గారపాడుకు చెందిన ఆర్. వసంతలక్ష్మి మరో 26 మంది హైకోర్టును ఆశ్రయించిన విషయం తెలిసిందే.
ఇటీవల ఈ వ్యాజ్యంపై విచారణ జరిపిన న్యాయమూర్తి.. వారి విధులపై స్పష్టత ఇస్తూ అఫిడవిట్ వేయాలని సెర్చ్ సీఈవోను
ఆదేశించారు. ఈ మేరకు ప్రభుత్వం అఫిడవిట్ ను కోర్ట్ కు సమర్పించింది
దీనిపై శుక్రవారం విచారణ చేపట్టిన హైకోర్టు మరోమారు వాలంటీర్ల అర్హతపై ప్రభుత్వాన్ని ప్రశ్నించింది. అదేవిధంగా అఫిడవిట్ కూడా పూర్తిగా లేదని పేర్కొంది.
తాము కోరిన వివరాలను గ్రామీణ పేదరిక నిర్మూలన
సొసైటీ(సెర్ప్) సీఈవో ఇంతియాజ్ కోర్టు ముందు ఉంచలే
దని హైకోర్టు ఆక్షేపించింది. ఈ మేరకు హైకోర్టు కింది విధంగా వ్యాఖ్యానించింది.
హైకోర్టు ఏమందంటే
సామాజిక సేవ కోసం నియమించుకున్న వాలంటీర్ల ద్వారా సంక్షేమ పథకాల లబ్ధిదారుల వివరాలు ఏవిధంగా సేకరిస్తారు? అందుకు ఏ చట్ట నిబంధనలను అనుమతిస్తున్నాయో స్పష్టత నివ్వాలని పేర్కొంది.
ప్రభుత్వ అధికారులతో చేయించాల్సిన పనులను
వీరి ద్వారా చేయిస్తున్నారని ఆక్షేపించింది. లబ్ధిదారుల
ఎంపికతో వారికేం సంబంధమని ఘాటుగా వ్యాఖ్యానించింది.
వాలంటీర్లకు జవాబుదారీతనం ఏమి ఉంటుందని పునరుద్ఘా
టించింది.
ప్రభుత్వం ఏమని చెప్పిందంటే
గ్రామ వార్డు వాలంటీర్లు కేవలం సమాచారాన్ని సేకరించి సచివాలయాలకు అందిస్తారని వారు ఎటువంటి లబ్ధిదారుల ఎంపికలో పాల్గొనడం లేదు అని సెర్ప్ సీఈవో ఇంతియాజ్ తరపు న్యాయవాది హైకోర్టుకు తెలిపారు.
అయితే పిటిషనర్ల తరపు న్యాయవాది వాదనలు వినిపిస్తూ న్యాయస్థానం కోరిన వివరాలు సెర్ప్ సీఈవో తాజాగా వేసిన అఫిడవిట్ లో లేవని తెలిపారు.
దీనితో ఏకీభవించిన న్యాయస్థానం మరో మారు మెరుగైన అఫీడవిట్ తో రావాలని ప్రభుత్వాన్ని ఆదేశించింది.
తదుపరి విచారణను రెండు వారాలకు వాయిదా వేస్తున్నట్లు జస్టిస్ బట్టు దేవానంద్ ప్రకటించారు.
Leave a Reply