ఆధార్, పాన్, డ్రైవింగ్ లైసెన్స్, పాస్ పోర్ట్, ఓటర్ కార్డ్ వంటి గుర్తింపు కార్డులు కలిగిన వారికి కేంద్ర ప్రభుత్వం గుడ్ న్యూస్ తెలిపింది.
Aadhaar Auto Update అనే సరికొత్త ఫీచర్ ను ఆధార్ లబ్ధిదారులకు త్వరలో తీసుకురానుంది.
అసలు ఈ ఆధార్ ఆటో అప్డేట్ అంటే ఎంటి ?
ఈ ఫీచర్ ప్రారంభం అయితే ఇక పై మీరు ఆధార్ లో అడ్రస్, డేట్ ఆఫ్ బర్త్ సహా ఇతర వివరాలు అప్డేట్ చేస్తే, మిగిలిన అన్ని డాక్యుమెంట్స్ లో ఆటోమేటిక్ గా మారిపోతుంది. దీని కోసం మీరు ప్రతి డాక్యుమెంట్ లో మార్చుకునేందుకు కష్ట పడాల్సిన అవసరం లేదు.
ఆధార్ ఆటో అప్డేట్ (Aadhar auto update) ఎలా పని చేస్తుంది?
సాధారణంగా ఆధార్, పాన్, పాస్ పోర్ట్ వంటివి కేంద్ర ప్రభుత్వ digilocker లో బద్రపరుచుకునే సౌలభ్యం మనకు ఉంటుంది. ఆవిధంగా బద్ర పరుచుకున్న డాక్యుమెంట్స్ లో ఈ ఆటో అప్డేట్ పని చేస్తుంది. Digilocker లో ఉంచే డాక్యుమెంట్స్ ను మనం ఎప్పుడైనా ఎక్కడైనా access చేసి డౌన్లోడ్ చేసుకోవచ్చు. పూర్తి ఉచితంగా ఈ ఫీచర్ అందుబాటులో ఉంటుంది.
అందులో ఉన్న ఆధార్ లో మనం ఏదైనా అప్డేట్ చేస్తే వెంటనే మిగిలిన డాక్యుమెంట్స్ లో కూడా ఈ అప్డేట్ రిక్వెస్ట్ వెళ్తుంది.
ఈ ఫీచర్ ఎప్పుడు ప్రారంభిస్తారు?
ప్రస్తుతం pilot దశలో ఉన్న ఈ ఫీచర్ వివిధ మంత్రిత్వ శాఖలకు అందుబాటులో ఉంది.
పాస్ పోర్ట్ కి సంబంధించి కూడా ఈ ఆటో అప్డేట్ ఫీచర్ పని చేసిన అనంతరం ఈ ఫీచర్ ను అందరికీ రిలీజ్ చేసే అవకాశం ఉంది.
త్వరలో ఈ ఫీచర్ ను తీసుకువస్తామని కేంద్రం ప్రకటించింది. ఈ ఏడాది బడ్జెట్ లో కూడా దీనికి సంబంధించి కేంద్ర మంత్రి ప్రకటించారు.
Leave a Reply