Highest FD Rate: 9.5 శాతం వడ్డీ ఇస్తున్న బ్యాంకులు ఏవో తెలుసా? ఈ బ్యాంక్స్ చూడండి

Highest FD Rate: 9.5 శాతం వడ్డీ ఇస్తున్న బ్యాంకులు ఏవో తెలుసా? ఈ బ్యాంక్స్ చూడండి

ఇటీవల రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా వరుసగా రేపో రేటును పెంచిన నేపథ్యంలో బ్యాంకులు సైతం డిపాజిట్ల పై వడ్డీలకు పోటీ పడి మరీ పెంచుతున్నాయి. స్టేట్ బ్యాంక్ సహా మరికొన్ని బ్యాంకులు అయితే కొన్ని స్పెషల్ డిపాజిట్ స్కీమ్స్ ను ప్రవేశపెట్టాయి.

అయితే సాధారణంగా ప్రభుత్వ , ప్రైవేట్ రంగంలో పెద్ద బ్యాంకులు గరిష్టంగా 7.75 శాతం వరకు వడ్డీ అందిస్తుండగా, పలు చిన్న బ్యాంకులు ఏకంగా 9 నుంచి 9.5% వడ్డీ రేట్లను ప్రకటించాయి.

అసలు బ్యాంకింగ్ రంగంలోనే అత్యదిక వడ్డీ ఇస్తున్న టాప్ 5 బ్యాంకుల లిస్ట్ మీకోసం

ఎక్కువ వడ్డీ ఇచ్చే జాబితాలో స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్ లదే హవా అని చెప్పాలి.

యూనిటీ స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్.

యూనిటీ స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్ ఈ లిస్ట్ లో అగ్రభాగాన ఉంది.కొత్తగా ప్రారంభించిన ఈ బ్యాంక్ 1,001 రోజుల కు గాను బ్యాంకింగ్ రంగంలో అత్యదిక వడ్డీ ఇచ్చే డిపాజిట్ స్కీమ్ ను ప్రవేశపెట్టింది. ఈ పథకం ద్వారా బ్యాంక్ సామాన్య ప్రజలకు 9% అదే సీనియర్ సిటిజన్స్ అయితే గరిష్ఠంగా 9.5 శాతం వడ్డీ రేటును ఇస్తుంది.

ఈ బ్యాంక్ నుంచి 501 రోజుల డిపాజిట్ల పై అయితే యూనిటీ బ్యాంక్ సీనియర్ సిటిజన్లకు 9.25 శాతం వడ్డీని , సామాన్య ప్రజలకు 8.75 వడ్డీ ని ఇస్తుంది. అయితే ఈ బ్యాంక్ ఇప్పుడిప్పుడే విస్తరిస్తుంది. ప్రస్తుతం దేశ వ్యాప్తంగా 113 బ్రాంచ్ లలో సేవలు అందిస్తుంది.

ఉత్కర్ష్ స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్

గరిష్టంగా 9% వడ్డీ అందిస్తున్న మరో బ్యాంక్ ఉత్కర్శ్ స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్. 700 రోజుల fixed డిపాజిట్ పథకం పై 8.25% ఇస్తుండగా, ఇదే పథకంలో సీనియర్ సిటిజన్స్ కు ఏకంగా 9% ఇస్తున్నారు. సాధారణంగా బ్యాంకులు సీనియర్ సిటిజన్స్ కు 0.5% ఎక్కువ వడ్డీ ని అదనంగా ఇస్తాయి అయితే ఈ బ్యాంక్ లో దాదాపు అన్ని డిపాజిట్ల పై 60 యేళ్లు దాటిన సీనియర్ సిటిజన్స్ కు 0.75% వడ్డీ ఇవ్వడం విశేషం. ఈ బ్యాంక్ కు తెలుగు రాష్ట్రాల్లోని హైదరాబాద్, వైజాగ్ లో కూడా బ్రాంచీలు ఉన్నాయి.

జన స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్

ఈ స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్ ద్వారా గరిష్టంగా 8.85% వడ్డీ వరకు సీనియర్ సిటిజన్స్ కు అందిస్తున్నారు. ఇక సామాన్యులకు 8.15% వడ్డీని ఇస్తున్నారు. 500 Days (Jana 5 year Anniversary) డిపాజిట్ స్కీమ్ కి ఈ వడ్డీ రేటు వర్తిస్తుంది.

ఇక మరో ఫిక్స్డ్ డిపాజిట్ స్కీమ్ లో >2 Years -3 Years కాల వ్యవధి లో 8.10% వడ్డీని ఇస్తున్నారు. అదే సీనియర్స్ కి అయితే 8.80% ఇస్తున్నారు. ఈ బ్యాంక్ కి హైదరాబాద్ లో బ్రాంచీలు కలవు

సూర్యోదయ్ స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్

సూర్యోదయ్ స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్ 999 రోజుల కాలవ్యవధి ఉన్న డిపాజిట్ పై సీనియర్ సిటిజన్లకు అత్యధికంగా 8.76 శాతం వడ్డీ రేటును, సామాన్య ప్రజలకు 8.51% వడ్డీ రేటును అందిస్తోంది. ఈ స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్ ద్వారా మరొక స్కీమ్ ఏదైతే 1.6 ఏళ్ల నుంచి 2 ఏళ్ల వరకు ఉండే డిపాజిట్ పై 8.51 శాతం వడ్డీ రేటును సీనియర్ సిటిజన్స్ కు అందిస్తోంది.

ఉజ్జివన్ స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్

ఈ స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్ అయితే చాలా రకాల డిపాజిట్ పథకాలను ప్రవేశపెట్టడం జరిగింది. ఇందులో 80 weeks (560 రోజులు) స్కీమ్ అత్యధికంగా 8.25% వడ్డీ ని అందిస్తుంది. ఇదే పథకం లో సీనియర్ సిటిజన్స్ కు 8.75% వడ్డీ రేటు ను అందిస్తుంది.


ప్రభుత్వ రంగంలో టాప్ 5 పెద్ద బ్యాంకులు అందిస్తున్న FD రేటు వివరాలను కింద చెక్ చేయండి.

Click here to Share

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You cannot copy content of this page