ఏపీలో నీ డ్వాక్రా మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం గుడ్ న్యూస్ తెలిపింది.
వైయస్సార్ ఆసరా పథకం ద్వారా ప్రతి ఏటా డ్వాక్రా మహిళలు తీసుకున్నటువంటి రుణానికి సంబంధించి రుణమాఫీ చేస్తున్న విషయం తెలిసిందే. ఇందులో భాగంగా వరుసగా మూడో ఏడాది రుణమాఫీకి రాష్ట్ర ప్రభుత్వం సిద్ధమైంది.
వైయస్సార్ ఆసరా అమౌంట్ ను డ్వాక్రా మహిళల ఖాతాల్లో మార్చ్ 25 నుంచి ఏప్రిల్ 10 వరకు జమ చేయనున్నట్లు తెలిపింది. ఆసరా వారోత్సవాల రూపంలో ఈ కార్యక్రమాన్ని నిర్వహించనున్నారు.
ఈ రుణ మాఫీ ఎవరికి వర్తిస్తుంది? ఎప్పటి రుణాలకు వర్తిస్తుంది?
ఏప్రిల్ 11 2019 వరకు తీసుకున్న రుణాలకు ఈ పథకం వర్తిస్తుంది. ప్రతి ఏటా అసలు మరియు వడ్డీ సకాలంలో చెల్లించిన వారికి రుణమాఫీ అమౌంట్ను రాష్ట్ర ప్రభుత్వం ఆ ఏడాదికి సంబంధించి డ్వాక్రా మహిళలకు ఖాతాలో జమ చేస్తూ వస్తుంది. ఇప్పటికే మూడు విడుదల జమ చేసిన ప్రభుత్వం మూడో విడతగా ఈ ఏడాది 2023 కి సంబంధించి ముహూర్తాన్ని ఫిక్స్ చేసింది. లబ్ధిదారుల ఖాతాలో మార్చి 25 వరకు ఈ అమౌంట్ విడుదల చేయనున్నట్లు తెలిపింది.
నాలుగు విడతల్లో ఈ అమౌంట్ ను రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేయనుంది. సుమారు 78 లక్షల మంది ఈ పథకం తో లబ్ది పొందుతున్నారు. ఇప్పటికే మూడో విడతకు సంబంధించి బయోమెట్రిక్ ప్రక్రియ ముగిసింది.
వైయస్సార్ ఆసరా పథకానికి సంబంధించి అన్ని లేటెస్ట్ అప్డేట్స్ మరియు లింక్స్ కింద ఇవ్వబడ్డాయి చెక్ చేయండి
Leave a Reply