వాలంటీర్ సేవా పురస్కారాలు 2023 కి సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం గుడ్ న్యూస్ తెలిపింది.
ప్రతి ఏటా ఉగాది రోజున విశేష సేవలు అందించిన గ్రామ వార్డు వాలంటర్ల కు ఏపి ప్రభుత్వం సేవా పురస్కారాలు అందిస్తున్న విషయం తెలిసిందే. అందులో భాగంగా ఈ ఏడాది కూడా వాలంటీర్ సేవ పురస్కారాలకు రాష్ట్ర ప్రభుత్వం శ్రీకారం చుట్టింది.
వాలంటీర్ సేవ పురస్కారాలు ఎప్పుడు ఇస్తారు?
మార్చి 22 2023 ఉగాది రోజున సేవా మిత్రా సేవా వజ్ర సేవారత్న పురస్కారాలకు ఎంపికైనటువంటి వాలంటీర్ల జాబితా ను విడుదల చేయనున్నట్లు తెలిపింది.
ఇక అవార్డ్స్ కి ఎంపికైన వారి కి నగదు పురస్కారం మరియు రివార్డ్స్ ఏప్రిల్ 14న పంపిణీ చేయనున్న ప్రభుత్వం.
Ap volunteer seva awards shall be conferred on : April 14 2023
వాలంటీర్ సేవా అవార్డ్స్ పొందిన వారికి ఏమి ఇస్తారు?
రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి వాలంటీర్స్ అందరికీ కనీసం సేవ మిత్ర అవార్డును రాష్ట్ర ప్రభుత్వం ఇస్తుంది. అయితే విశిష్ట సేవలు అందించిన వారికి సేవ రత్న మరియు సేవా వజ్ర పురస్కారాలను అందించడం జరుగుతుంది.
సేవా మిత్ర – ఈ పురస్కారం అందుకున్న వారికి పదివేల రూపాయలు ఇస్తారు
సేవా రత్న – ఈ పురస్కారానికి ఎంపికైన వారికి 20 వేల రూపాయలను అందిస్తారు
సేవా వజ్ర – ఈ పురస్కారానికి ఎంపికైన వారికి 30 వేల రూపాయలను ఇస్తారు.
ఈ పురస్కారాలకు సంబంధించి లేటెస్ట్ అప్డేట్స్ మరియు year wise volunteer awards list కొరకు కింది లింక్ ఫాలో అవ్వండి.
మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం మన టెలిగ్రామ్ ఛానల్లో ఫాలో అవ్వండి.
Leave a Reply