Influenza H3N2: కొత్త ఫ్లూ తో భారీగా రోగులు..తెలుగు రాష్ట్రాలకు హైఅలెర్ట్..ఏపి లో ఫీవర్ సర్వే కు ఆదేశాలు

Influenza H3N2: కొత్త ఫ్లూ తో భారీగా రోగులు..తెలుగు రాష్ట్రాలకు హైఅలెర్ట్..ఏపి లో ఫీవర్ సర్వే కు ఆదేశాలు

Influenza A H3N2: ఈ కొత్త ఫ్లూ వైరస్ రకం తో ఇప్పుడు దేశం లో ప్రజలు భారీ ఎత్తున హాస్పిటల్స్ కు క్యు కడుతున్నారు.

ఈ ఇన్ఫ్లుఎంజా ఫ్లూ కారణంగా ప్రస్తుతం ప్రతి ముగ్గురిలో ఒకరికి జ్వరం, దగ్గు, జలుబు , గొంతు నొప్పి వంటి లక్షణాలు కనిపిస్తున్నాయి. ఈ నేపథ్యంలో జాగ్రత్త గా ఉండాలని తెలుగు రాష్ట్రాలు సహా అన్ని రాష్ట్రాలను ICMR హెచ్చరించింది.

అంతే కాకుండా ఈ ఫ్లూ నుంచి కోలుకున్న తరువాత కూడా దీర్ఘకాలికంగా ఈ ప్రభావం ఉంటుందని, అయితే ప్రజలు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని ICMR తెలిపింది.

అలర్ట్ అయిన ఏపి ప్రభుత్వం..మరో విడత ఫీవర్ సర్వే

కేంద్ర సంస్థ ICMR నుంచి హై అలెర్ట్ జారీ అయిన నేపథ్యంలో ఏపి ప్రభుత్వం అలెర్ట్ అయింది. మరో విడత ఇంటింటి కి వెళ్లి ఫీవర్ సర్వే నిర్వహించాలని ఆదేశించింది.

కోవిడ్ సమయంలో ANM, వాలంటీర్స్ సహకారంతో పలు విడతలు ఫీవర్ సర్వే నిర్వహించిన విషయం తెలిసిందే.

లక్షణాలు ఉన్న వారు జాగ్రత్తలు పాటిస్తే మంచిది.

ఈ ఫ్లూ భారిన పడిన వారు వెంటనే చికిత్ర తీసుకోవడం తో పాటు, గుంపులో కి వెళ్లకుండా ఉంటే మంచిది.

బయటకు వెళ్ళినప్పుడు, దగ్గి నప్పుడు , తుమ్మి నప్పుడు నోరు కు ఏదైనా అడ్డు పెట్టుకోడం బెటర్. కోలుకునే వరకు కలిసి భోజానాలు చేయడం మానేస్తే ఇంకా మంచిది.


మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం రెగ్యులర్ గా Studybizz ని ఫాలో అవ్వండి.

Click here to Share

You cannot copy content of this page