తెలంగాణలో మార్చి 8న మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకొని మహిళా దినోత్సవ వారోత్సవాలను నిర్వహించాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఈ రోజున మహిళలకు ఎన్నో కానుకలను ప్రకటించింది.
ఈమేరకు పట్టణాల్లో మహిళ స్వయం సహాయక సంఘాల ఆధ్వర్యంలో తయారైన ఉత్పత్తుల ప్రదర్శన, అమ్మకాల క్యాంపులు నిర్వహించాలని, ప్రభుత్వ రుణాలు, సబ్సిడీల వంటి వాటిని వినియోగించుకొని స్వయం సమృద్ధి సాధించిన వీధి వర్తకుల నుంచి మొదలుకొని మహిళా వ్యాపారవేత్తల వరకు వివిధ రంగాలకు చెందిన ఔత్సాహిక మహిళా పారిశ్రామికవేత్తలను ప్రత్యేకంగా గుర్తించాలని మంత్రి సూచించారు.
మార్చ్ 8 నుంచి వారం పాటు కంటి వెలుగు ద్వారా పురపాలక శాఖలోని మహిళా ఉద్యోగులందరికీ ప్రత్యేక క్యాంపులు నిర్వహించనున్నట్లు తెలిపారు.
వీటితో పాటు ఈ వారోత్సవాలలో మహిళలకు వడ్డీ లేని రుణాలను పంపిణీ చేసే కార్యక్రమాలను కూడా సిద్ధం చేసినట్లు మంత్రి తెలిపారు.
వారం పాటు జరిగే ఈ కార్యక్రమాలకు వివిధ శాఖల్లోని ఉన్నతాధికారులను, విభాగాధిపతులను, మహిళా జిల్లా కలెక్టర్లను, పోలీస్ ఉన్నతాధికారులు, మహిళా జడ్జీల వంటి వారిని ప్రత్యేక అతిథులుగా ఆహ్వానించి ఈ కార్యక్రమాలను నిర్వహించుకునేలా ప్రణాళికలు రూపొందించాలని పురపాలక శాఖ అధికారులకు మంత్రి కేటీఆర్ సూచించారు.
మరోవైపు మంత్రి హరీష్ రావు కూడా ఇదే అంశం పై మరొక సభలో క్లారిటీ ఇచ్చారు. మార్చి 8వ తేదీ మహిళా దినోత్సవం సందర్భంగా రెండేళ్లు గా పెండింగ్ లో ఉన్న వడ్డీలేని రుణాలను మంజూరు చేసి బ్యాంకులలో జమ చేస్తామని మహిళా సంఘాలకు ఆర్థిక మంత్రి శుభవార్త చెప్పారు.
అంతేకాకుండా అంతర్జాతీయ మహిళా దినోత్సవం పురస్కరించుకొని మహిళా ఉద్యోగుల కు ప్రభుత్వం స్పెషల్ క్యాజువల్ లీవ్ ను కూడా ప్రకటించడం విశేషం.
Leave a Reply