ఏపీ లో ఇక పై రేషన్ మెనూ పెరగనుంది. త్వరలో అందరికి బియ్యం తో పాటు ఇతర ధాన్యాలు కూడా అందించేందుకు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు సమాయత్తం అయ్యాయి.
రాబోయే నెలల్లో రాష్ట్ర వ్యాప్తంగా రేషన్ పై రాగులు, జొన్నలు , గోధుమ పిండి ని పంపిణి చేయనున్నట్లు మంత్రి నాగేశ్వరరావు తెలిపారు. ఈ మేరకు కేంద్రం కూడా అంగీకరించినట్లు ఆయన పేర్కొన్నారు.
ఇప్పటికే పైలట్ దశలో [AP Ration Update]..
రాష్ట్ర వ్యాప్తంగా ఇప్పటికే రాయలసీమ లో రాగులు, జొన్నలు పంపిణి ని పైలట్ ప్రాజెక్టు కింద చేపడుతున్నారు. దీనికి మంచి స్పందన వస్తున్నట్లు ప్రభుత్వం పేర్కొంది.
ఇక ఉత్తరాంధ్ర జిల్లాలలో గోధుమ పిండి ని కూడా పంపిణి చేస్తున్నారు . 16 రూపాయలకే సబ్సిడీ పై ఈ పంపిణి చేస్తున్నారు.
త్వరలో రాష్ట్ర వ్యాప్తంగా అమలు చేస్తామని అదే విధంగా రాష్ట్రానికి లక్ష అంత్యోదయ కార్డులను కూడా కేంద్రం కొత్తగా మంజూరు చేసేందుకు అంగీకరించిందని మంత్రి నాగేశ్వర రావు వెల్లడించారు.
Leave a Reply