మార్చి 2023 నెలకు సంబంధించి పెన్షన్ పేమెంట్ లకు గాను కొత్తగా ఆధార్ ముఖ ధ్రువీకరణ (Aadar Face Authentication) ఆప్షన్ ను YSR Pension kanuka App లో ఇవ్వటం జరిగింది.Face ఆప్షన్ వెంటనే ఇవ్వబడదు. దానికి గాను పెన్షన్ దారుని బయోమెట్రిక్ / ఐరిష్ కనీసం 3 సార్లు ఫెయిల్యూర్ అయిన తరువాత Face ఆప్షన్ చూపించటం జరుగును. Face ఆప్షన్ కూడా 3 సార్లు ఫెయిల్యూర్ అయితే అప్పుడు RBIS కు వెళ్ళటం జరుగును.
Note : Face ద్వారా పెన్షన్ ధ్రువీకరణ సమయం లో పెన్షన్ దారుని మొహం పై తగిన లైటింగ్ ఉండేలా చూసుకోవాలి. అదే విధంగా అప్లికేషన్ లో చూపించే విషయాలను ఫాలో అయితే వెంటనే కాప్చర్ చెయ్యటం జరుగును.
పెన్షన్ నగదును గ్రామ వార్డు వాలంటీర్ వారు సాధారణ సెలవులతో సంబంధం లేకుండా నెలలో 1 నుంచి 5వ తేదీ లోపు పంపిణీ చేయవలసి ఉంటుంది.
వృద్ధులు, వితంతువులు, చేనేత కార్మికులు, కల్లుగీత కార్మికులు, ఒంటరి మహిళలు, మత్స్యకారులు, సాంప్రదాయ చర్మకారులు, ఎయిడ్స్ వ్యాధిగ్రస్తులు వారికి జనవరి 2023 నెల నుంచి నగదును రూ.2500 నుంచి 2750 కు పెంచటం జరిగింది.
పెన్షన్ పంపిణీ పూర్తి అయిన వెంటనే పంచగా మిగిలిన నగదును వెంటనే సంబంధిత WEA/WWDS వారికి అందజేయవలెను. పెన్షన్ పంపిణీ చివరి తేదీ పూర్తయిన వెంటనే 2 పని దినములలో నగదులు ప్రభుత్వానికి తిరిగి కట్టవలసి ఉంటుంది.
పెన్షన్ నగదు ఏ నెలకు సంబంధించి ఆ నెలకు మాత్రమే విడుదల అవటం జరుగుతుంది.ఆయా నెలకు సంబంధించిన నగదు పెన్షన్ దారుడు తీసుకోకపోయినట్టయితే ఆ నగదు మరుసటి నెల ఆ నెలలో ఇచ్చే పెన్షన్ తో కలిపి ఇవ్వటం జరగదు. పెన్షన్ దారుడు వరుసగా 3 నెలలు పెన్షన్ తీసుకోకపోతే వారిని శాశ్వత వలసదారులుగా పరిగణించడం జరుగుతుంది. తరువాత మూడు నెలల లోపు వారి అర్జీ మేరకు పెన్షన్ పున ప్రారంభించడం జరుగుతుంది.
పెన్షన్ నగదు ప్రతి నెల వారికి నచ్చిన ప్రదేశంలో తీసుకునే వెసులుబాటు పెన్షన్ దారులకు ఉంటుంది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఎవరైనా ఒక ప్రదేశం నుంచి ఇంకొక ప్రదేశానికి వలస వెళ్లినట్లయితే వారు గ్రామా లేదా వార్డు సచివాలయంలో పెన్షన్ ట్రాన్స్ఫర్ అప్లికేషన్ దరఖాస్తు చేసుకుంటే పెన్షన్ ట్రాన్స్ఫర్ అవుతుంది.
Remittance మొదలు రెండు రోజులు దాటిన తరువాత రోజుకు ₹ 100/- లేదా 18% వడ్డీ (ఏది ఎక్కువ అయితే అది ) ఫైన్ విధించబడును. Remittance తేదీ నుంచి 10 రోజులు దాటితే క్రమశిక్షణా చర్యలు తీసుకోబడును.
Startek Scanner Subscription Expire ఐనవారు ACPL యాప్ ఓపెన్ చేసి టాప్ లో రైట్ సైడ్ మూడు డాట్స్ మీద క్లిక్ చేసి Re-Register మీద క్లిక్ చెయ్యండి.
Leave a Reply