రైతులకు ముఖ్య గమనిక.
పీఎం కిసాన్ 13 వ ఇంస్టాల్మెంట్ ఈ నెల లో విడుదల చేయనున్న నేపథ్యంలో ఈకెవైసి పెండింగ్ ఉన్న వారికి కేంద్రం చివరి అవకాశం కల్పించింది.
రైతులు EKYC చేయుటకు ఈ నెల అనగా ఫిబ్రవరి 10 వరకు అవకాశం కల్పిస్తున్నట్లు ప్రభుత్వ వర్గాలు తెలిపాయి. అనగా ఈ నెలలో కేంద్రం విడుదల చేయనున్న PM కిసాన్ 13 వ విడత నిధులు జమ కావాలంటే తప్పని సరిగా ఫిబ్రవరి 10 లోపు EKYC పూర్తి చేయాలనీ కేంద్రం తెలిపింది.
ఇప్పటికే ఎన్నో సార్లు కేంద్రం ఈకెవైసి గడువును పాడిగించిన విషయం తెలిసిందే , అయితే ఈ సారి ఇదే చివరి అవకాశం అని కేంద్ర ప్రభుత్వం స్పష్టం చేసింది.
ఏపీ లో రైతు భరోసా తో కలిపి ఈ అమౌంట్ ని ఫిబ్రవరి 24 న జమ చేస్తుండగా , తెలంగాణ లో ఆ లోపే జమ చేసే అవకాశం ఉంది.
EKYC ప్రాసెస్ ఇలా చేయండి
- ఇక్కడ కింద ఇవ్వబడిన లింక్ పైన క్లిక్ చేసి మీ 12 అంకెల ఆధార్ ఎంటర్ చేయాలి
2. Search బటన్ పైన క్లిక్ చేయాలి
3. మీరు ఎంటర్ చేసిన ఆధార్ సరైనదే అయితే మొబైల్ నంబర్ అడుగుతుంది. మొబైల్ ఎంటర్ చేయండి
4. తర్వాత GET OTP పైన క్లిక్ చేస్తే మీకు OTP SMS వస్తుంది.
5. అది ఎంటర్ చేసి submit చేస్తే మీ EKYC పూర్తి చేయవచ్చు .
Leave a Reply