మీ వాహనంపై చలాన్ ఉందా? – వాట్సప్‌లోనే ఈ-చలాన్ చెక్ & చెల్లింపు – పూర్తి విధానం

మీ వాహనంపై చలాన్ ఉందా? – వాట్సప్‌లోనే ఈ-చలాన్ చెక్ & చెల్లింపు – పూర్తి విధానం

ప్రభుత్వ సేవలన్నీ ఇకపై ఒక్క క్లిక్‌తో మీ మొబైల్లోనే పొందవచ్చు. ఇందుకోసం రాష్ట్ర ప్రభుత్వం వాట్సప్ గవర్నెన్స్ సేవలను అందుబాటులోకి తెచ్చింది. తాజాగా ఇందులో పోలీస్ శాఖ సేవలును కూడా చేర్చారు. ఈ సేవల ద్వారా మీ వాహనంపై ఉన్న ఈ-చలాన్ వివరాలు తెలుసుకోవడంతో పాటు, వెంటనే ఆన్లైన్‌లోనే చెల్లింపులు కూడా చేయవచ్చు.

Table of Contents

వాట్సాప్‌లో లభించే పోలీస్ సేవలు

  • FIR పొందడం
  • FIR స్థితి తెలుసుకోవడం
  • వాహన ఈ-చలాన్ వివరాలు

వాట్సప్ గవర్నెన్స్ నంబర్

రాష్ట్ర ప్రభుత్వం వాట్సప్ గవర్నెన్స్ సేవల కోసం 95523 00009 నంబర్‌ను అందుబాటులోకి తెచ్చింది.

  • ఈ నంబర్‌ను మీ ఫోన్‌లో సేవ్ చేసుకోండి
  • వాట్సప్‌లో HI అని మెసేజ్ పంపండి
  • మన మిత్ర వాట్సప్ గవర్నెన్స్ ఓపెన్ అవుతుంది
  • భాష ఎంపిక కోసం TE టైప్ చేయండి (తెలుగు)

వాట్సప్ ద్వారా ఈ-చలాన్ చెక్ / చెల్లింపు విధానం

  • భాష ఎంపిక తర్వాత కింద కనిపించే “సేవను ఎంచుకోండి” ఆప్షన్‌పై క్లిక్ చేయండి
  • అందులో నుంచి పోలీస్ శాఖ సేవలు ఎంపిక చేయండి
  • అప్పుడు FIR, FIR స్థితి, ఈ-చలాన్ అనే మూడు ఆప్షన్లు కనిపిస్తాయి
  • ఈ-చలాన్ ఎంపిక చేయండి
  • మీ వాహనం రిజిస్ట్రేషన్ నంబర్ నమోదు చేసి క్లిక్ చేయండి

మీ వాహనంపై ఉన్న అన్ని ఈ-చలాన్లు స్క్రీన్‌పై కనిపిస్తాయి. వాటిని బ్యాంక్ కార్డు లేదా ఆన్లైన్ పేమెంట్ ద్వారా వెంటనే చెల్లించవచ్చు. చెల్లింపు పూర్తయ్యాక రశీదు కూడా అందుతుంది.

ఒకవేళ మీ వాహనంపై ఎలాంటి చలాన్లు లేకపోతే “No Challans Found” అనే సందేశం కనిపిస్తుంది.

రవాణా శాఖ ఈ-చలాన్లు ఎలా చెక్ చేయాలి?

నిబంధనలు ఉల్లంఘించిన వాహనాలపై రవాణా శాఖ కూడా ఈ-చలాన్లు విధిస్తుంది. వీటిని పరివాహన్ సేవ వెబ్‌సైట్ ద్వారా తెలుసుకోవచ్చు.

  • https://parivahan.gov.in వెబ్‌సైట్‌కు వెళ్లండి
  • e-Challan Payment ఆప్షన్‌పై క్లిక్ చేయండి
  • మీ వాహనం నంబర్ నమోదు చేయండి
  • మీ వాహనంపై ఉన్న పోలీస్ & రవాణా శాఖ చలాన్లు అన్నీ కనిపిస్తాయి
  • అక్కడే ఆన్లైన్ పేమెంట్ ఆప్షన్ ద్వారా డబ్బులు చెల్లించవచ్చు

సారాంశం: ఇకపై ఈ-చలాన్ వివరాల కోసం పోలీస్ స్టేషన్ లేదా కార్యాలయాలకు వెళ్లాల్సిన అవసరం లేదు. వాట్సప్ గవర్నెన్స్ లేదా పరివాహన్ వెబ్‌సైట్ ద్వారా సులభంగా చెక్ చేసి, ఆన్లైన్‌లోనే చెల్లింపులు చేయవచ్చు.

ముఖ్య గమనిక: మన మిత్ర వాట్సాప్ గవర్నెన్స్ ద్వారా లభించే ఈ సేవలన్నీ పూర్తిగా ఉచితం. ఇకపై పోలీస్ స్టేషన్లు, ప్రభుత్వ కార్యాలయాలకు తిరగాల్సిన అవసరం లేకుండా, మీ మొబైల్‌లోనే ఈ-చలాన్ వివరాలు తెలుసుకుని చెల్లించవచ్చు.

ఏపీ ప్రభుత్వం ప్రవేశపెట్టిన మన మిత్ర వాట్సాప్ గవర్నెన్స్ ద్వారా పోలీస్ & రవాణా శాఖ సేవలు మరింత పారదర్శకంగా, సులభంగా మారాయి. వాహనదారులు ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలని అధికారులు సూచిస్తున్నారు.

FAQs – ఈ-చలాన్ & మన మిత్ర వాట్సాప్ గవర్నెన్స్

1. మన మిత్ర వాట్సాప్ గవర్నెన్స్ అంటే ఏమిటి?

మన మిత్ర వాట్సాప్ గవర్నెన్స్ అనేది ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రవేశపెట్టిన డిజిటల్ సేవ. దీని ద్వారా ప్రభుత్వ సేవలను వాట్సాప్‌లోనే, ఉచితంగా పొందవచ్చు.

2. ఈ-చలాన్ సేవను పొందడానికి ఎలాంటి యాప్ డౌన్‌లోడ్ చేయాలా?

లేదు. అదనపు యాప్ అవసరం లేదు. కేవలం వాట్సాప్ ఉంటే సరిపోతుంది.

3. వాట్సాప్ గవర్నెన్స్ నంబర్ ఏమిటి?

వాట్సాప్ గవర్నెన్స్ అధికారిక నంబర్ 95523 00009.

4. ఈ-చలాన్ ఎలా చెక్ చేయాలి?

95523 00009 నంబర్‌ను సేవ్ చేసి వాట్సాప్‌లో BH మెసేజ్ పంపాలి. భాష కోసం TE టైప్ చేసి, పోలీస్ సేవలు → ఈ-చలాన్ ఎంపిక చేసి వాహనం నంబర్ నమోదు చేయాలి.

5. ఈ-చలాన్ చెల్లింపు వాట్సాప్‌లోనే చేయవచ్చా?

అవును. బ్యాంక్ కార్డు లేదా ఆన్లైన్ పేమెంట్ ద్వారా వాట్సాప్‌లోనే చలాన్ చెల్లించవచ్చు. చెల్లింపు పూర్తయ్యాక రశీదు కూడా లభిస్తుంది.

6. నా వాహనంపై చలాన్ లేకపోతే ఏమి చూపిస్తుంది?

మీ వాహనంపై ఎటువంటి చలాన్ లేకపోతే “No Challans Found” అనే సందేశం కనిపిస్తుంది.

7. ఈ సేవలు ఉచితమా?

అవును. మన మిత్ర వాట్సాప్ గవర్నెన్స్ ద్వారా లభించే అన్ని సేవలు పూర్తిగా ఉచితం.

8. FIR వివరాలు కూడా వాట్సాప్‌లో చూడవచ్చా?

అవును. FIR పొందడం, FIR స్థితి తెలుసుకోవడం కూడా పోలీస్ సేవల విభాగంలో అందుబాటులో ఉన్నాయి.

9. రవాణా శాఖ విధించిన చలాన్లు ఎక్కడ చూడాలి?

రవాణా శాఖ చలాన్లను https://parivahan.gov.in వెబ్‌సైట్‌లో వాహనం నంబర్ నమోదు చేసి చూడవచ్చు.

10. పోలీస్ & రవాణా శాఖ చలాన్లు ఒకే చోట కనిపిస్తాయా?

అవును. పరివాహన్ వెబ్‌సైట్‌లో పోలీస్ మరియు రవాణా శాఖ విధించిన చలాన్లు రెండూ ఒకే జాబితాలో కనిపిస్తాయి.

11. ఈ సేవలు ఎవరికీ ఉపయోగపడతాయి?

వాహనదారులు, సాధారణ ప్రజలు, FIR వివరాలు తెలుసుకోవాలనుకునే వారు – అందరికీ ఈ సేవలు ఉపయోగపడతాయి.

12. కార్యాలయాలకు వెళ్లాల్సిన అవసరం ఉందా?

లేదు. ఇకపై పోలీస్ స్టేషన్ లేదా ప్రభుత్వ కార్యాలయాలకు వెళ్లాల్సిన అవసరం లేకుండా అన్ని సేవలు మీ మొబైల్‌లోనే లభిస్తాయి.

You cannot copy content of this page